Thug Life: భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు పడుతోంది. తొలి వారాంతంలో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు కూడా సాధించలేకపోయింది. సాక్నిల్క్ నివేదిక ప్రకారం జూన్ 5న విడుదలైన ఈ చిత్రం.. నాలుగు రోజుల ప్రారంభ వారాంతంలో దేశవ్యాప్తంగా రూ. 36.52 కోట్ల మాత్రమే సాధించింది. సినిమా పై మిశ్రమ స్పందనలు వెలువెత్తడం.. వసూళ్ల పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాల కమల్ కెరీర్ లో అత్యల్ప ప్రారంభ వసూళ్లు సాధించి చిత్రం ఇదే అని చెప్పవచ్చు.
పడిపోయిన వసూళ్లు
గతేడాది విడుదలైన 'ఇండియన్ 2' దేశీయ బాక్సాఫీస్ వద్ద దాని మూడు రోజుల ప్రారంభ వారాంతంలో రూ. 69.15 కోట్లు సాధించగా.. అంతకముందు వచ్చిన విక్రమ్ మూడు రోజుల్లో రూ. 110.8 కోట్ల వసూళ్లు సాధించింది.
మొదటి రోజు వసూళ్లు ఆశాజనంకంగా మొదలైనప్పటికీ.. క్రమంగా తగ్గుమొహం పట్టాయి. ఆదివారం ఈ చిత్రం దేశవ్యాప్తంగా కేవలం రూ. 6.12 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇక పై వసూళ్లకు బ్రేక్ పడనుందా? లేదా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? అనే చర్చ్ జరుగుతోంది.
1వ రోజు: రూ. 15.5 కోట్లు
2వ రోజు: రూ. 7.15 కోట్లు
3వ రోజు: రూ. 7.75 కోట్లు
4వ రోజు: రూ. 6.12 కోట్లు
మొత్తం: రూ. 36.52 కోట్లు
నార్త్ లో ఇబ్బందులు
ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ సినిమా బాగా ఇబ్బంది పడుతోంది. హిందీలో మొదటి రోజు కేవలం రూ. 65 లక్షలు సాదించగా.. రెండవ రోజు వసూళ్లు మరింత పడిపోయాయి. రెండవ రోజు రూ. 30 లక్షలు సాధించింది. ఆ తర్వాత శనివారం 24 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఈ గణాంకాలు ఉత్తర భారతదేశంలో 'థగ్ లైఫ్' విఫలమైందని స్పష్టంగా చూపిస్తున్నాయి.
వందల కోట్ల నిర్మాణ విలువలు, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ.. బలమైన కంటెంట్ లేకపోతే విజయం సాదించడం కష్టమని ఈ సినిమా ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, నాజర్ వంటి స్టార్ కాస్ట్ నటించారు.
Also Read: Housefull 5: పబ్లిక్ టాక్ కోసం నేరుగా రంగంలోకి దిగిన స్టార్ హీరో! (వీడియో వైరల్)