Thug Life: కమల్ హాసన్ కి నెట్ ఫ్లిక్స్ ఊహించని దెబ్బ..!

'తగ్ లైఫ్' పోస్ట్ థియేట్రికల్ రైట్స్ విషయంలో మేకర్స్ కి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ముందుగా నెట్ ఫ్లిక్స్ రూ. 130 కోట్లకు డీల్ కుదుర్చుకోగా.. ఇప్పుడు అందులో  20-25% తగ్గించాలని ప్రతిపాదిస్తుందట. సినిమాకు ప్లాప్ టాక్ రావడమే దీనికి కారణమని సమాచారం.

New Update

అయితే 'నాయకన్'  తర్వాత కమల్- మణిరత్నం కాంబోలో వస్తున్న సినిమా కావడంతో   'తగ్ లైఫ్' పై  భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో నెట్ ఫ్లిక్స్  పోస్ట్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ మొత్తంలో చెల్లించడానికి సిద్ధమైంది. కానీ విడుదలైన తర్వాత  ఆశించిన స్థాయిలో  ఫలితాన్ని అందించలేకపోయింది.  దీంతో నెట్ ఫ్లిక్స్ తమ  డిజిటల్ హక్కుల విలువను తిరిగి చర్చించే ఆలోచనలో ఉందట. 

అంతేకాదు ఓటీటీ విడుదల సమయాన్ని కూడా తగ్గించాలని అనుకుంటున్నారట. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. కానీ, 'తగ్ లైఫ్' బాక్స్ ఆఫీస్ ఫలితాల కారణంగా నాలుగు వారాలకే స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో   త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో నటించారు.

Also Read:Balayya Viral Video: బాలయ్య మంచి మనసు! అభిమాని కొడుక్కి అన్నం తినిపించిన వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు