Skin Care: సాధారణంగా ప్రతీ ఒక్కరు తన చర్మ సౌదర్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మొహం ఎల్లప్పుడూ కాంతివంతంగా, అందంగా, ఎలాంటి మచ్చలు లేకుండా మెరిసిపోవాలని కోరుకుంటారు. దీని కోసం అమ్మాయిల నుంచి అబ్బాయిల వరకు అందరూ రకరకాల బ్యూటీ ప్రాడక్స్ట్ వాడుతుంటారు. వేలకు, వేలు బ్యూటీ పార్లలో ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే చర్మానికి సంబంధించిన చిన్న చిన్న పొరపాట్లే ముఖ కాంతిని దూరం చేస్తాయని గుర్తించలేకపోతారు. మొహం కడిగేటప్పుడు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. నీటితో మొహాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము..
సబ్బు
చాలా మొహానికి సాధారణ సబ్బు మాత్రమే వాడుతుంటారు. కానీ సబ్బు చర్మం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సబ్బులోని అధిక మొత్తంలో డిటర్జెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని నిర్జీవం చేస్తుంది. అందువల్ల మొహానికి సబ్బు కంటే ఏదైనా ఫేస్ వాష్ ఉపయోగించడం మంచిది. ఫేస్ వాష్ కొనలేనివారు శనగపిండితో కూడా ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు.
గోరువెచ్చని నీరు
ముఖాన్ని ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. చాలా వేడి లేదా చాలా చల్లటి నీటితో కడగడం వల్ల చర్మం పొడిబారుతుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు పొరపాటున కూడా ముఖం కడుక్కోవడానికి వేడి నీటిని ఉపయోగించకూడదు. ఇది మొహాన్ని పాడుచేస్తుంది. అలాగే మొహాన్ని రోజుకు నాలుగు, ఐదు సార్లు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. పదే పదే కడగడం వల్ల ఛాయా తగ్గిపోవడం మొదలవుతుంది.
చేతులను శుభ్రం కడుక్కోవాలి
మొహాన్ని కడుక్కోవడానికి ముందు చేతులను సబ్బు, శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. మురికి చేతులతో మొహాన్ని కడగడం ద్వారా చర్మానికి హాని కలిగిస్తుంది. చేతి పై ఏదైనా కెమికల్, ఇంక్ లాంటి ఉన్నప్పుడు అలాగే మొహాన్ని శుభ్రం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
Also Read: Sai Pallavi Sister’s Marriage: చెల్లి పెళ్ళిలో సాయి పల్లవి డాన్స్.. వీడియో వైరల్..! – Rtvlive.com