Skin Care Products : లోషన్లు, సన్‌స్క్రీన్, ఆయిల్స్ వల్ల పిల్లలో హార్మోన్ల లోపాలు

లోషన్లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ కండిషనర్లు, ఆయింట్‌మెంట్లు ఇంకా సన్‌స్క్రీన్‌ లోషన్లు వీటన్నింటి వల్లా పిల్లల హార్మోన్ల లోపాలు ఏర్పడుతున్నాయి అని చెబుతున్నారు రీసెర్చర్లు. వీటిల్లో ఉండే థాలేట్ చాలా అధికంగా ఉండడం వలన ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు.

author-image
By Manogna alamuru
New Update
skin care

Skin Care Products :

పిల్లల చర్మం బావుండాలని వాళ్ళు పుట్టిన దగ్గర నుంచే మనం ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతుంటాం. మాయిశ్చరైజర్లు, ఆయిల్స్, సన్‌స్క్రీన్ లోషన్లు, ఆయింట్ మెంట్‌లు...ఇలా చాలా పూసేస్తుంటాం. వీటితో వాళ్ళ చర్మం బానే ఉంటుంది కానీ హార్మోన్ల అసమతుల్యతే దెబ్బ తింటుంది అని చెబుతున్నారు రీసెర్చర్లు. లోషన్లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ కండిషనర్లు, ఆయింట్‌మెంట్లు, సన్‌స్క్రీన్‌లు వీటన్నింట వల్లనా పిల్లల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.  పిల్లల్లో ఎండో క్రైన్‌కు అంతరాయం కలిగించే రసాయనాలు వీటిల్లో కనిపట్టారు జార్జ్ మాసన్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ పబ్క్ హెల్త్ పరిశోధకులు. ఈ లోషన్లు, ఆయిల్స్ మన్నిక, వాటి గుణాలను మెరుగుపర్చడానికి ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు. దీన్నే థాలేట్ అంటారు. ఇవి చాలా వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులో కనిపిస్తాయి. దీన వల్లనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు పరిశోధకులు. ఈ రసాయనాలు శరీరంలోని సహజ హార్మోన్లను నిరోధించడం లేదా సంకర్షణ అయ్యేలా చెయ్యడం లాంటివి చేస్తున్నాయి. దీని వలన వృద్ధి దశలో ఉండే పిల్లలై అసాధారణ ప్రభావం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరిశోధకుడు, డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ మైఖేల్ ఎస్ బ్లూమ్. అయితే ఈ పరిశోధన ఇంకా మొదటి స్థాయిలోనే ఉందని...దీని మీద మరింత రీసెర్చ్ చేయాల్సి ఉందని చెబుతున్నారు. 

అమెరికాలోని పది స్టేట్‌లలో నాలుగు నుంచి ఎనిమిది ఏళ్ళ పిల్లల మీద పరిశోధనలు జరిపారు. మొత్తం 630 మంది పిల్లలను పరిశీలించారు రీసెర్చర్లు. ఈ పిల్లల మెడికల్ డేటా సేకరించడమే కాకుండా క్లినికల్ ఎగ్జామినేషన్ను కూడా నిర్వహించారు. పరీక్షలకు ముందు లోషన్లు, ఆయిల్స్ లాంటివి పూయమని చెప్పారు. ఆ తరువాత నే అన్ని పరీక్షలను నిర్వహించారు. దీని ప్రకారం చరమ సంరక్షణ ఉత్పత్తుల్లో థాలేట్ లేదా థాలేట్-రిప్లేస్‌మెంట్ కాంపౌండ్స్ లు అధిక సాంద్రతలో ఉన్నాయని కనుగొన్నామని చెప్పారు. లోషన్లు పూసాక పిల్లల శరీరంలో ఎండో–క్రైన్ లో అంతరాయాలు ఏర్పడ్డం స్పష్టంగా కనిపించిందని డాక్టర్ బ్లూమ్ చెప్పారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఎంత తక్కువ వీలయితే అంత తక్కువగా లోషన్లు, ఆయిల్స్ పూయాలని తల్లిదండ్రులకు సూచించామని తెలిపారు. దీంతో పాటూ ఈ విషయాన్ని అందరు తల్లిదండ్రులకూ తెలిసేలా ప్రచారం చేయాలని బ్లూమ్ అంటున్నారు. 

Also Read :  గుండెపోటు సమయంలో మహిళలకు ఏం జరుగుతుందో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు