JIO Network Down: జియో నెట్వర్క్ దేశం మొత్తం ఆగిపోయింది. ఇంటర్నెట్, మొబైల్ సేవలు ఏమీ పని చేయడం లేదు. ఈరోజు ఉదయం నుంచే కనెక్టివిటీ సమస్యలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు తాజాగా మొత్తంగా పని చేయడమే మానేసింది. ముంబైలో ఇది ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీంతో వేలమంది యూజర్లు సోషల్ మీడియాలో కంప్లైంట్లతో వెల్లువెత్తుతున్నారు. సేవల అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పాట్నా మరియు కోల్‌కతాతో సహా అనేక ప్రధాన నగరాల నుండి ఎక్కువగా ఫర్యాదులు వస్తున్నాయి. మధ్యాహ్నం 12:08 గంటలకు దాదాపు 10,522 మంది వినియోగదారులు జియో నెట్వర్క్ పని చేయం లేదని కంప్లైంట్ చేశారు. 65% మంది వినియోగదారులు ‘నో సిగ్నల్’ సమస్యలను ఎదుర్కొంటున్నారని, 19% మంది మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో పోరాడుతున్నారని, 16% మంది జియో ఫైబర్ సేవలతో ఇబ్బందలు పడుతున్నారని తెలుస్తోంది.
Reliance
Ambani Wedding : గ్రాండ్ గా అనంత్ – రాధికా హల్దీ వేడుకలు.. బాలీవుడ్ సెలెబ్రెటీల సందడి..!
Anant Ambani – Radhika Merchant Haldi Celebrations : రిలయన్స్ (Reliance) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుటుంబం చిన్న కుమారుడు అనంత్ – రాధికా పెళ్లి సంబరాల్లో బిజీగా ఉంది. అనంత్ – రాధికా పెళ్లి వేడుకలు నిరుపేదల సామూహిక వివాహాలతో మొదలయ్యాయి. ముందుగా మామేరు వేడుక, ఆ తర్వాత గ్రహపూజ, సంగీత్ వేడుక జరిగాయి.
అనంత్- రాధికా హల్దీలో బాలీవుడ్ తారలు
ఇక నిన్న సాయంత్రం అనంత్-రాధికా (Anant – Radhika) హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. ఈ జంట హల్దీ వేడుకలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు (Bollywood Celebrities) పాల్గొన్నారు. జాన్వీ కపూర్, బోనీ కపూర్, సల్మాన్ ఖాన్, అనన్య పాండే, రణ్ వీర్ సింగ్, సారా అలీఖాన్, మానుషీ చిల్లర్, డైరెక్టర్ అట్లీ సందడి చేశారు. హల్దీ వేడుకల్లో సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ పసుపు కుర్తా, నలుపు పైజామా ధరించి స్టైలిష్ దేశీ లుక్ లో కనిపించారు. జాన్వీ అందమైన ఎల్లో శారీలో ఎలిగెంట్ గా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరలవుతున్నాయి.
Ranveer Singh eats PAAN at Anant Ambani & Radhika Merchant’s Haldi❤️🔥#anantambani #anantambaniprewedding #anantambaniradhikamerchant #anantradhikawedding #radhikamerchant #ambani #ambaniwedding #zoomnews pic.twitter.com/ZEOhn0bnuR
— Zoom News (@Zoom_News_India) July 9, 2024
జులై 12న వివాహం
అనంత్- రాధికా మర్చంట్ పెళ్ళికి ఇంకా 3 రోజుల సమయం ఉంది. జులై 12న వీరిద్దరూ ఏడడుగుల బంధంతో ఒకటి కాబోతున్నారు. అనంత్- రాధికా వివాహ వేడుకలు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరగనున్నాయి. జూలై 14న రిసెప్షన్‌తో ఈ వివాహ వేడుకలు ముగుస్తాయి. బాలీవుడ్, హాలీవుడ్ సెలెబ్రిటీలు, దేశంలోని ప్రముఖులు అనంత్- రాధికా వివాహ వేడుకకు హాజరు కానున్నారు.
అనంత్- రాధికా హల్దీలో బాలీవుడ్ తారలు
Also Read: Mr. Bachchan: రవితేజ – భాగ్య శ్రీ డ్యూయెట్.. ట్యూన్ అదిరిపోయిందిగా..! – Rtvlive.com
Jio: భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్.. జియో ప్లాట్‌ఫారమ్‌కు గ్రీన్ సిగ్నల్!
JIO To Launch Satellite Internet: ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ను ప్రారంభించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్‌ఫారమ్‌లకు అనుమతి లభించింది. లక్సెంబర్గ్ SES భాగస్వామ్యంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు స్పేస్ రెగ్యులేటర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాయిటర్స్ నివేదించింది.
అమెజాన్, ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ ప్రయత్నాలతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు జియో ప్లాట్‌ఫారమ్ కూడా పోటీలో ఉంది. ఈ మేరకు ఆర్బిట్ కనెక్ట్ ఇండియాకు మూడు అనుమతులు మంజూరు చేయబడ్డట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అందులో జియో ఒకటిగా పేర్కొన్నారు. ఏప్రిల్, జూన్లలో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) ఈ అనుమతులు జారీ చేయగా.. ఆర్బిట్ కనెక్ట్స్ ఉపగ్రహాలను భారతదేశం పైన ఉంచడానికి అనుమతిస్తాయి. ఇది ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ను అందిస్తుంది.
Also Read: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఈ వివరాలు మీకు తెలుసా?
Anant Ambani Pre Wedding : అంబానీ కొడుకు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ కోసం భారత్ కు ప్రపంచ కుబేరులు..
Anant Ambani Pre Wedding : ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ‘మన్ కీ బాత్'(Mann Ki Baat) 107వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) మాట్లాడుతూ- ‘ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లి చేసుకుంటున్నాయి. ఇది అవసరమా? భారత గడ్డపై భారతీయుల మధ్య వివాహాలు జరుపుకుంటే దేశ సొమ్ము దేశంలోనే ఉంటుంది. దీనివల్ల చిన్నవారికి కూడా ఉపాధి దొరుకుతుంది.’ అని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదిగో దానిని స్ఫూర్తిగా తీసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు MD ముఖేష్ అంబానీ(Mukesh Ambani). ఆయన తన చిన్న కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ మన దేశంలోనే నిర్వహిస్తున్నారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో మార్చి 1 నుంచి 3 వరకూ అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతాయి. ఇందుకోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. మూడురోజులకు సంబంధించి ఈవెంట్స్ వివరాలతో ఇన్విటేషన్స్ కూడా ఇప్పటికే అతిథులకు చేరిపోయాయి. ప్రపంచంలోనే 10వ అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి. దానికి సంబంధించిన ముందస్తు వేడుకలు.. మరి సహజంగానే అపర కుబేరులు.. వ్యాపార దిగ్గజాలు తరలి వస్తారు కదా. ఇదిగో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వస్తారని భావిస్తున్న అతిథుల లిస్ట్..
మార్క్ జుకర్‌బర్గ్ నుండి ఇవాంక ట్రంప్ వరకు..
ఈ ఫంక్షన్(Anant Ambani Pre Wedding) కు వచ్చే అతిథుల లిస్ట్ లో మెటా సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సిఇఒ టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సిఇఒ బాబ్ ఇగర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బ్లాక్‌రాక్ సిఇఒ లారీ ఫింక్, అడ్నాక్ సిఇఒ సుల్తాన్ అహ్మద్ ఉన్నారు. అల్ జబర్కూడా వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు, EL రోత్స్ చైల్డ్ ఛైర్మన్ లిన్ ఫారెస్టర్ డి రోత్స్ చైల్డ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, టెక్ ఇన్వెస్టర్ యూరి మిల్నర్, భూటాన్ రాజు-రాణిలకు కూడా అంబానీ కుటుంబం నుంచి ఆహ్వానాయాలు వెళ్లాయి.
ఇక వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు క్రీడలు, బాలీవుడ్, సైన్స్, జర్నలిజం, సామాజిక సేవకు సంబంధించిన ప్రముఖులను కూడా ఆహ్వానించారు. జామ్‌నగర్‌లో జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుక(Anant Ambani Pre Wedding) లో బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ల ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.
అతిథులకు సంప్రదాయ కండువాలు..
వివాహానికి(Marriage) ముందు జరిగే కార్యక్రమంలో గుజరాత్‌లోని కచ్ – లాల్పూర్కు చెందిన మహిళా కళాకారులు తయారు చేసిన సంప్రదాయ కండువాలను అతిథులకు అందజేస్తారు. జాతీయ మీడియా(National Media) లో వస్తున్న వార్తల ప్రకారం వివాహానికి ముందు జరిగే వేడుకకు దాదాపు 1000 మంది అతిథులు హాజరుకానున్నారు.
Also Read : దీన్ని కొట్టే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్క షేర్ లక్షన్నర! MRF రికార్డ్!!
9 పేజీల ఇన్విటేషన్..
Anant Ambani Pre Wedding : మూడు రోజుల విలువైన దుస్తుల ఫోటోగ్రాఫ్‌లతో కూడిన వార్డ్రోబ్ ప్లానర్‌తో అతిథులకు 9-పేజీల ఇన్విటేషన్ కార్డు పంపించారు. వార్డ్రోబ్ ప్లానర్లోని మూడు పేజీలు మూడు రోజుల దుస్తుల ఫోటోగ్రాఫ్‌లతో పాటు కార్యక్రమ వివరాలు.. ప్రోగ్రామ్ థీమ్‌ను కూడా వీటిలో ఇచ్చారు. అంతేకాదు, దీనితో పాటు, ఈవెంట్స్ రోజుల్లో జామ్‌నగర్‌లో ఉండవచ్చనే ఉష్ణోగ్రతల వివరాలు కూడా పేర్కొన్నారు. అతిథుల కోసం హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, డ్రెస్ డిజైనర్లను కూడా ఏర్పాటు చేశారు.
అతిథుల కోసం ఢిల్లీ-ముంబై నుంచి చార్టర్డ్ విమానం ఏర్పాటు..
Anant Ambani Pre Wedding అతిథుల కోసం ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విమానాలు ఢిల్లీ, ముంబై నుండి జామ్‌నగర్‌కు వస్తాయి. జామ్‌నగర్ నుండి ఈ నగరాలకు తిరిగి వెళ్తాయి. మార్చి 1న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విమానాలు అందుబాటులో ఉంటాయి.
వధువు రాధిక మర్చంట్ వివరాలివే..
రాధిక వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె. వీరేన్ మర్చంట్ గుజరాత్‌లోని కచ్ నివాసి. ఆయన ADF ఫుడ్స్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అలాగే ‘ఎన్కోర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్’ CEO, వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆమె ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ఎన్కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమెకు ట్రెక్కింగ్ – స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురు భవన్ థాకర్ ఆధ్వర్యంలో రాధిక క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది.
ChatGPT Alternative: అంబానీ AI చాట్‌బాట్ ‘హనుమాన్’ రెడీ.. OpenAI చాట్‌జిపిటికి దబిడి దిబిడే!
ChatGPT Alternative – Hanooman : భారతదేశం టెక్నాలజీ విషయంలో ఏదైనా సాధించడం అసాధ్యం అని ఎవరు చెప్పారు? మన దేశ డిక్షనరీలోనే అసాధ్యం అనే పదం లేదు. జూన్ 2023లో OpenAI వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మాన్ (Sam Altman) భారతదేశానికి వచ్చాడు. ఆ సమయంలో అతను భారతదేశాన్ని ఎగతాళి చేశాడు. చాట్‌జీపీటీ వంటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం భారత్ లాంటి దేశానికి అసాధ్యమని ఆయన అన్నాడు. కానీ మనం పైన చెప్పుకున్నట్లుగా, అసాధ్యం అనే పదం భారత ప్రజల డిక్షనరీలో లేదు.. ఎప్పటికీ ఉండదు. ఆల్ట్‌మన్ ప్రకటనకు ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త, ప్రపంచంలోని 10వ అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) గట్టి సమాధానం ఇచ్చారు. విశేషమేమిటంటే ప్రపంచంలోని AI కంపెనీలన్నీ ఈ దెబ్బతో పూర్తిగా జాగ్రత్త పడటం తప్పనిసరి అవుతుంది. అవును త్వరలో ముఖేష్ అంబానీ AI మోడల్ ‘హనుమాన్’ (Hanooman ChatGPT) ఉనికిలోకి రాబోతోంది. రిలయన్స్ ఈ మోడల్‌ను మార్చి నెలలో విడుదల చేయబోతోంది. ప్రారంభించిన తర్వాత ఇది, ChatGPT విపరీతమైన పోటీని ఎదుర్కొంటుంది.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చే నెలలో చాట్‌జిపిటి లాంటి AI చాట్‌బాట్ ‘హనుమాన్’ని (Reliance Hanooman AI) విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హనుమాన్ స్పీచ్-టు-టెక్స్ట్ కలిగి ఉంటుంది. ఇందుకోసం ‘భారత్ జీపీటీ గ్రూప్’గా పేరుపొందిన 8 అనుబంధ విశ్వవిద్యాలయాల సహకారంతో ఈ సంస్థ పనిచేస్తోంది. కంపెనీ ఈ AI చాట్‌బాట్‌ను మంగళవారం టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో చూపించింది. ఈ సమయంలో, దక్షిణ భారతదేశానికి చెందిన ఒక మోటార్‌సైకిల్ మెకానిక్ తన మాతృభాష తమిళంలో AI బాట్‌తో మాట్లాడాడు. అలాగే, ఒక బ్యాంకర్ హిందీలో టూల్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన ఒక డెవలపర్ కంప్యూటర్ కోడ్ రాయడానికి దాన్ని ఉపయోగించాడు.
స్పీచ్-టు-టెక్స్ట్ సామర్థ్యంతో హనుమాన్..
ఇది విభిన్నమైన ఎల్ఎల్ఎం (లార్జ్ లాంగ్వేజ్ మోడల్) అని ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం చైర్మన్ గణేష్ రామకృష్ణన్ తెలిపారు. హనుమాన్ స్పీచ్-టు-టెక్స్ట్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. రిలయన్స్ జియో నిర్దిష్ట వినియోగదారుల కోసం అనుకూలీకరించిన మోడళ్లను కూడా సిద్ధం చేస్తుంది అని చెబుతోంది.
Also Read: అరే ఏంట్రా ఇదీ.. మళ్ళీనా! డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్!
కంపెనీ తన 45 కోట్ల మంది కస్టమర్ల నెట్‌వర్క్‌లో AIని ఉపయోగించే ప్లాట్‌ఫారమ్ అయిన జియో బ్రెయిన్‌పై కూడా పని చేస్తోంది. ఇది కూడా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, దేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో లక్షలాది మందికి చదవడం, రాయడం రాదు. అటువంటి వారికి స్పీచ్ తో టెక్స్ట్ విధానంలో జియో బ్రెయిన్ సహాయపడుతుందని చెబుతున్నారు.
రిలయన్స్ టెలివిజన్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా ప్రారంభించనుంది.రెండు నెలల క్రితం, జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ టెలివిజన్ కోసం తన స్వంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇది కాకుండా, రిలయన్స్ జియో వాణిజ్యం, కమ్యూనికేషన్, పరికరాలు వంటి వివిధ రంగాలలో ప్రోడక్ట్స్, సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఎయిర్ ఫైబర్
కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా ఎయిర్ ఫైబర్ (Air Fiber) సర్వీస్‌ను ప్రారంభించింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే 8 నగరాల్లో ఈ సేవ ప్రారంభమైంది. ఎయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్ కోసం జియో రూ. 1000 రుసుమును నిర్ణయించింది. ఇప్పుడు దీని సేవ 3939 పట్టణాల్లో అందుబాటులో ఉంది.
పెద్ద డేటాసెట్ల నుండి శిక్షణ పొందిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)..
లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది లోతైన అభ్యాస అల్గోరిథం. వారు పెద్ద డేటాసెట్లను ఉపయోగించి శిక్షణ పొందారు. అందుకే పెద్దది అంటారు. ఇది టెక్స్ట్- ఇతర కంటెంట్‌ను అనువదించడానికి, అంచనా వేయడానికి, రూపొందించడానికి వారిని అనుమతిస్తుంది. న్యూరల్ నెట్‌వర్క్‌లు (NNలు) అని కూడా పిలువబడే పెద్ద భాషా నమూనాలు మానవ మెదడు నుండి ప్రేరణ పొందిన కంప్యూటింగ్ సిస్టమ్‌లు. ప్రోటీన్ నిర్మాణాలను అర్థం చేసుకోవడం, సాఫ్ట్వేర్ కోడ్ రాయడం మొదలైన అనేక పనుల కోసం పెద్ద భాషా నమూనాలు శిక్షణ పొందవచ్చు.
Amabani: టాటా గ్రూపుతో చేతులు కలపనున్న ముఖేష్ అంబానీ!
Reliance-Tata Deal: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) టాటా గ్రూప్‌తో కలిసి జాయింట్ వెంచర్ ప్రారంభించాలని యోచిస్తున్నారు. బిజినెస్ స్టాండర్డ్‌లోని ఒక నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance) టాటా ప్లేలో (TATA Play) 29.8 శాతం వాటా కోసం వాల్ట్ డిస్నీ కంపెనీతో చర్చలు జరుపుతోంది.
రిలయన్స్ ఈ ప్లాన్‌తో భారతదేశ టెలివిజన్ పంపిణీ రంగాన్ని పెద్ద ఎత్తున చేరుకోవాలనుకుంటోంది. శాటిలైట్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్‌లో టాటా సన్స్ (TATA Sons) 50.2 శాతం వాటాను కలిగి ఉంది. డిస్నీ కాకుండా, మిగిలిన షేర్లు సింగపూర్ ఆధారిత ఫండ్ టెమాసెక్ యాజమాన్యంలో ఉన్నాయి.
ఒప్పందం కుదిరితే..
ఒప్పందం కుదిరితే, టాటా గ్రూప్, రిలయన్స్ జాయింట్ వెంచర్లో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి అవుతుందని, ఇది టాటా ప్లే ప్లాట్‌ఫారమ్‌లో జియో సినిమా (Jio Cinema) పరిధిని పెంచుతుందని నివేదిక పేర్కొంది. టెమాసెక్ కంపెనీలో తన 20 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది, దీని విలువ సుమారు $1 బిలియన్. మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, టాటా ప్లే రూ. 4,499 కోట్ల ఆదాయంపై రూ. 105 కోట్ల నష్టాన్ని నివేదించింది.
డిస్నీ తో చర్చలు చివరి దశలో ఉన్నాయి
భారతదేశపు అతిపెద్ద మీడియా, వినోద వ్యాపారాన్ని సృష్టించేందుకు డిస్నీ (Disney), రిలయన్స్ తమ మెగా స్టాక్- అండ్- నగదు విలీనాన్ని ఖరారు చేసేందుకు చర్చల చివరి దశలో ఉన్నట్లు నివేదించబడింది. Viacom18 సంయుక్త సంస్థలో 42 – 45% వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉద్భవించవచ్చు. RIL 60% వాటాను కలిగి ఉన్న కొత్త సంస్థలో $1.5 బిలియన్ల వరకు నగదు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు, అయితే మిగిలిన 40% వాల్ట్ డిస్నీ కలిగి ఉంటుంది.
Also Read: మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్ .. ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!