Reliance : ఆపిల్‌ను వెనుకకు నెట్టి..వరల్డ్ టాప్ 2లో రిలయన్స్

 భారత అతిపెద్ద కంపెనీగా గుర్తింపు పొందింది రియలన్స్‌ ఇండస్ట్రీస్‌. కాగా ఫ్యూచర్‌ బ్రాండ్ 2024 ప్రతిష్టాత్మక గ్లోబల్ ర్యాంకింగ్‌లో రిలయన్స్‌ సంస్థ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో యాపిల్‌, నైక్‌ వంటి దిగ్గజ కంపెనీలను వెనుకకు నెట్టి టాప్‌ 2లో నిలిచింది.

New Update
Reliance Industries

Reliance Industries

Reliance : భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యా్ప్తంగా రెండో అత్యుత్తమ బ్రాండ్‌గా రిలయన్స్‌ నిలిచింది. యాపిల్‌, నైక్‌ వంటి దిగ్గజ కంపెనీలను వెనుకకు నెట్టి టాప్‌ 2లో నిలిచింది.

Also Read: Canada: అవసరమైతే ఉక్రెయిన్‌ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని!

 భారత అతిపెద్ద కంపెనీగా గుర్తింపు పొందిన రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫ్యూచర్‌ బ్రాండ్ 2024 ప్రతిష్టాత్మక గ్లోబల్ ర్యాంకింగ్‌లో రిలయన్స్‌ సంస్థ రెండో స్థానంలో నిలిచింది.ఈ క్రమంలో కీలక సంస్థలను వెనక్కి నెట్టి ముందుకెళ్లింది. 2024 ఏడాదికి గాను ఫ్యూచర్‌ బ్రాండ్ విడుదల చేసిన అంతర్జాతీయ అత్యత్తమ బ్రాండ్‌ ఈ ర్యాంకులను విడుదల చేసింది. కాగా ఇందులో యాపిల్‌, నైక్‌ వంటి అత్యన్నత కంపెనీలను వెనక్కి నెట్టి రిలయన్స్‌ రెండో స్థానంలో నిలవడం విశేషం.

 Also Read: Canada: అవసరమైతే ఉక్రెయిన్‌ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని!
 
కాగా గత ఏడాది 13వ స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఏకాఏకిన 11 స్థానాలను ఎగబాకి టాప్‌ 2 స్థానంలో నిలవడం గమనార్హం. యాపిల్‌, నైక్‌, వాల్డ్‌ డిస్నీ, నెట్‌ ప్లిక్స్‌, మైక్రోసాఫ్ట్‌ , టోయోటా వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లను దాటుకుని రిలయన్స్‌ దూసుకుపోయింది. మరో విశేషం ఏంటంటే అత్యత్తమ బ్రాండ్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ బ్రాండ్‌ కంపెనీ రిలయన్స్‌ ఒక్కటే. గతేడాది అగ్రస్థానంలో నిలిచిన యాపిల్‌ ఈసారి రిలయన్స్‌ తర్వతి స్థానంలో నిలిచింది. ఒక భారతీయ కంపెనీ టాప్-2లో చోటు సంపాదించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 

 Also Read : పెయింటర్ కాదు పాపిష్టోడు.. భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం : సంగారెడ్డిలో దారుణం

కాగా అంతర్జాతీయంగా టాప్‌ 10 జాబితాలో నిలిచిన సంస్థలలో శాంసంగ్ (దక్షిణ కొరియా) , రియలన్స్‌ (ఇండియా), యాపిల్‌ (అమెరికా), నైక్‌ (అమెరికా), ఏఎస్‌ఎంఎల్‌ సెమీ కండక్టర్స్‌ (నెదర్లాండ్స్‌), డెనహర్‌ కార్పొరేషన్‌ (అమెరికా), ది వాల్డ్‌ డిస్నీ( అమెరికా), మౌటాయ్‌ (చైనా), టీఎస్‌ఎంసీ సెమీ కండక్టర్స్‌(తైవాన్‌), ఐహెచ్‌సీ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) లు నిలిచాయి.

ఇది కూడా చదవండి: మీ బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయా?


 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు