అంబానీకి షాక్.. పతనమవుతున్న రిలయన్స్ పవర్ షేర్లు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ స్టాక్స్ ఒక్కసారిగా పతనమయ్యాయి. రికార్డు స్థాయికి దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ షేర్లు ఈరోజు 4.33 శాతం తగ్గి రూ.44.35 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.

New Update
Anil Ambani: అనిల్ అంబానీకి సెబీ భారీ షాక్‌

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి బిగ్ షాక్ తగిలింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు పడిపోతున్నాయి. రికార్డు స్థాయికి దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ షేర్లు ఈరోజు పతనమయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్‌లో 4 శాతానికి పైగా షేర్లు పడిపోయాయి. రిలయన్స పవర్ షేర్లు బీఎస్‌ఇలో 4.33 శాతం తగ్గి రూ.44.35 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే ఒకప్పుడు 99 శాతం షేర్లు పడిపోయాయి. భారీగా పడిపోయిన షేర్లు పుంజుకున్నా మళ్లీ పతనం అయ్యాయి. గత కొన్ని రోజుల కిందట అప్పర్ సర్క్యూట్లు కొట్టిన గ్రూప్ స్టాక్స్ అన్ని ఇప్పుడు ఒక్కసారిగా లోయర్ సర్క్యూట్లు కొడుతున్నాయి. 

ఇది కూడా చూడండి:  వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

పునరుత్పాదక రంగంలో విస్తరించాలని..

ఈక్విటీ షేర్లు, ఈక్విటీ లింక్డ్ సెక్యూరిటీలు లేదా ఈక్విటీ షేర్లుగా మార్చుకుని, దీర్ఘకాలిక వనరుల పెంపు పరిశీలించడానికి రిలయన్స్ పవర్ డైరెక్టర్ల బోర్డు అక్టోబర్ 3వ తేదీ గురువారం రోజు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రిలయన్స్ పవర్ ప్రిఫరెన్షియల్, విదేశీ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్‌లతో పాటు ఇతర ఆమోదాలను కోరడం వంటివాటి గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. రిలయన్స్ పవర్ ప్రమోటర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్‌కు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.1524.60 కోట్ల విలువైన రూ.46.20 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.803.60 కోట్లను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. 

ఇది కూడా చూడండి: కంగనా కొత్త కారు ధర తెలిస్తే మైండ్ బ్లాకే.. ఏకంగా బంగ్లాను అమ్మేసి కొనుగోలు చేసిందిగా..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు