Nithiin Into Multiplex Business : మన టాలీవుడ్ (Tollywood) హీరోలు సినిమాలతో పాటూ ఇతర రంగాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ, లాంటి హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ (Multiplex Business) లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నారు. ఈ మధ్య మన మాస్ మహారాజా రవితేజ కూడా ఇదే బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఇక తాజాగా లవర్ బాయ్ నితిన్ సైతం ఈ లిస్ట్ లో చేరిపోయాడు.
నితిన్ మల్టీప్లెక్స్…
హీరో నితిన్ (Nithiin) ఏషియన్ సంస్థతో కలిసి ‘ANS’ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. నితిన్‌కు ఇంతకుముందే సితార థియేటర్ ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సంగారెడ్డిలో ఉన్న ఈ థియేటర్ ప్రస్తుతం రేనోవేషన్లో ఉంది. అయితే ఇదే థియేటర్‌ను ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ థియేటర్‌కు ‘ఏషియన్ నితిన్ సితార'(ANS) అని పేరు పెట్టినట్లు సమాచారం.
Also Read : అబ్బాయి ప్లేస్ లో బాబాయ్ సినిమా.. ‘NBK109’ నుంచి మాస్ అప్డేట్!
త్వరలోనే నితిన్ ఈ మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నితిన్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ప్రెజెంట్ వెంకీ కుడుములతో ‘రాబిన్ హుడ్’, వేణు శ్రీరామ్ తో ‘ తమ్ముడు’ వంటి సినిమాలు చేస్తున్నాడు.