Robinhood Pre Release: "రాబిన్‌హుడ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ గా డేవిడ్ వార్నర్..!

నితిన్, శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ "రాబిన్‌హుడ్". ఉగాది కానుకగా థియేటర్లలో సందడకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌కి డేవిడ్ వార్నర్ గెస్ట్ గా రాబోతున్నారాని ప్రచారం జరుగుతోంది. అందుకు కావాల్సిన  అనుమతుల కోసం మూవీ టీమ్ ఇప్పటికే చర్యలు తీసుకుందని టాక్.

New Update
Robinhood Pre Release

Robinhood Pre Release

Robinhood Pre Release: వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్(Nitiin), శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "రాబిన్‌హుడ్". ఉగాది కానుకగా థియేటర్లలో సందడకు సిద్ధమైంది. "భీష్మ" తర్వాత మళ్లీ రెండో సారి వెంకీ కుడుముల, నితిన్ కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రొమోషన్ల జోరు పెంచింది. వరుస ఈవెంట్లతో, కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్ గా నితిన్ టీమ్ అభిమానులను ఆకర్షిస్తోంది.

Also Read:"ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!

అయితే పుష్పరాజ్ పాత్రకి వీరాభిమాని అయిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం ఇప్పటికే డేవిడ్ వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్ . ఈ మూవీ తో ఫస్ట్ టీమ్ డేవిడ్ భాయ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. క్రికెట్ లోను డేవిడ్ వార్నర్ కి  తెలుగు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు రాబిన్ హుడ్ తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

Also Read:ఇది రియలైజేషన్ అంటే..! తప్పు ఒప్పుకున్న అనన్య నాగళ్ల

"రాబిన్‌హుడ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్..?

అయితే, తాజాగా "రాబిన్‌హుడ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్(David Warner) గెస్ట్ గా రాబోతున్నారాని ప్రచారం జరుగుతోంది. అందుకు కావాల్సిన  అనుమతుల కోసం మూవీ టీమ్ ఇప్పటికే చర్యలు తీసుకుందని టాక్ నడుస్తోంది. ఈ వార్త నిజమైతే ఈవెంట్ కు భారీగా అభిమానులు రావడం పక్కా, కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి "రాబిన్‌హుడ్" టీమ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వార్నర్ తెలుగు సినిమాలో కనిపించడం పై ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరి డేవిడ్ వార్నర్ మూవీలో ఎలా కనిపించబోతున్నాడో తెలియాలంటే   మార్చి 28 వరకు ఆగాల్సిందే.

Also Read:రీ-రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన 'సలార్'.. అరాచకం సామి ఇదీ!!

Also Read:నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

Advertisment
తాజా కథనాలు