charmi : ఛార్మిని అలా చూపించి తప్పు చేశా..  క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!

శ్రీ ఆంజనేయం లాంటి భక్తి సినిమాలో హీరోయిన్ ఛార్మీని ఎందుకు అలా చూపించారని ఓ నెటిజన్ కృష్ణవంశీని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అవును..  తప్పేనండీ... క్షమించండి.. తీరని సమయాలు తీరని చర్యలు తీరని పనులు అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

New Update
charmi kaur

charmi kaur

నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించి  తెరకెక్కించిన చిత్రం శ్రీ ఆంజనేయం. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.  కానీ ఇప్పుడు టీవీలో వస్తే మాత్రం సినిమాను వదలకుండా చూస్తారు ప్రేక్షకులు. అయితే ఇలాంటి భక్తి సినిమాలో హీరోయిన్ ఛార్మిని హాట్ గా చూపించడం మాత్రం అప్పుడు,ఇప్పటికీ ప్రేక్షకులకు నచ్చదు. అయితే తాజాగా ఇదే విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ట్విట్టర్ లో ప్రశ్నించాడు ఓ నెటిజన్.  

శ్రీ ఆంజనేయం లాంటి భక్తి సినిమాలో హీరోయిన్ ఛార్మీని ఎందుకు అలా చూపించారు? అని ప్రశ్నించగా  కృష్ణవంశీ స్పందిస్తూ అవును..  తప్పేనండీ... క్షమించండి.. తీరని సమయాలు తీరని చర్యలు తీరని పనులు అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.  ఈ సినిమాలో హీరోయిన్ ఛార్మి గ్లామర్ డోస్ శృతిమించిందని,ఆమె క్యారెక్టర్ తీరు సినిమాను తప్పుదోవ పట్టించిందని అప్పట్లో కృష్ణవంశీని బాగానే ట్రోల్ చేశారు. తాజాగా ఇలా చేయడం తన తప్పేనని కృష్ణవంశీ ఒప్పుకోవడం విశేషం. 

రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం

రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన కృష్ణవంశీ..  1995లో వచ్చిన గులాబీ సినిమాతో దర్శకుడిగా మారారు.  గులాబీ సినిమా టేకింగ్ చూసిన నాగార్జున కృష్ణవంశీకి అవకాశం ఇచ్చారు.  అలా వీరి కాంబోలో నిన్నే పెళ్ళాడుతా సినిమా తెరకెక్కింది. ఆ తరువాత స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి 'ఆంధ్రా టాకీస్' సంస్థను చేపట్టారు కృష్ణవంశీ. నక్సల్ నేపథ్యంలో తీసిన  సింధూరం అనే సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఆర్థికంగా బాగా దెబ్బతీసింది.  ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి సముద్రం లాంటి సినిమాలను తీసినట్టు స్వయంగా అతనే ఇంటర్వ్యూలలో చెప్పారు కృష్ణవంశీ. 

Also Read :  సెలబ్రిటీల బాత్‌రూమ్, బెడ్‌రూముల్లో స్పై కెమెరాలు.. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌తో ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు