Krishna River
కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి
KRMB: కేఆర్ఎంబీకి కొత్త ఛైర్మన్.. ఎవరంటే
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) చైర్మన్‌గా అతుల్ జైన్‌ను నియమించారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కేఆర్ఎంబీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న శివనందన్ కుమార్ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అతుల్ జైన్‌ను ఛైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: హైదరాబాద్‌కు సమానంగా వరంగల్ అభివృద్ధి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ
Chandrababu Swearing : చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణానది (Krishna River) లో భారీ పడవల ర్యాలీ (Boat Rally) చేపట్టారు. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ అమరావతి (Amaravati) ఇసుక పడవల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో పడవల ర్యాలీ నిర్వహించారు. బోట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఉన్నాయి.
Also Read : భారత్‌కు మరో డేంజర్ వైరస్.. WHO హెచ్చరిక
Crime News: ప్రొద్దుటూరు వ్యాపారి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో మాజీ ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి.!
Vijayawada: విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారి సుబ్బారావుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో పరిశీలించగా వారికి సూసైడ్ నోట్ లభ్యం అయింది.
Also Read: పెను విషాదం.. 49 మంది మృతి.. 140 మంది గల్లంతు..!
సూసైడ్ నోట్లో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి పేరు ఉంది. ఆయనతోపాటు పలువురి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేకు పలువురు వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు వడ్డీకి ఇప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. బాకీ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
Krishna River : కృష్ణా నదిలో పడవ ప్రమాదం.. ఆ ఎంపీతోపాటు 25 మంది ప్రయాణికులు..!
NTR District : ఎన్టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా నది(Krishna River) లో ఘోర ప్రమాదం(Boat Accident) తప్పింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో నిలిచిపోయింది. రాయపూడి నుంచి బయలు దేరిన లాంచీలో ఎంపి నందిగం సురేష్(Nandigam Suresh) బందువులు ఉన్నట్లు సమాచారం.
అయితే వెంటనే సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణ.. అప్రమత్తంగా వ్యవహరించి స్థానిక మత్యకారుల సహకారంతో యుద్ద ప్రాతిపదికన పడవలోని ప్రయాణికులను రక్షించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు, వెస్ట్ జోన్ ఏసిపి మురళీ కృష్ణా రెడ్డి నేతృత్వంలో భద్రతా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు తిరుగు ప్రయాణం అయినట్లు సమాచారం రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.