NBK 50 Years Celebrations: బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, అల్లు అర్జున్.. అందరూ ఓకే స్టేజీ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్ ఫ్యాన్స్‌కు పండుగే పండుగ కదా.. బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు కౌంట్‌డౌన్ మొదలైంది..! అందరూ ఓకే చోట కనిపించే మరో పండుగకు సమయం దగ్గరపడింది. కానీ ఒక్కటే లోటు..! ఇప్పటివరకు అందరికి ఇన్విటేషన్ అందింది.. ఆ ఒక్కరికి తప్ప..! అవును..! జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పటివరకు ఆహ్వానం అందలేదట..! అందరిని పిలిచారని ఆనందించేలోపే తారక్‌ను ఎందుకు పిలవలేదన్న వార్త అభిమానుల మనసును నొప్పిస్తోంది. మరోవైపు అల్లు ఫ్యామిలీ-మెగా ఫ్యామిలీ ఓకే వేదికపై కనిపిస్తుండడం మరో హాట్ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు పూర్తవతుండడంతో తెలుగు సినీ పరిశ్రమ బాలయ్య కోసం ఓ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తోంది. అధికారికంగా బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు సెలబ్రేట్ చేయనుంది. తెలుగు సినీ పరిశ్రమలోని పలు యూనియన్లు కలిసి హైదరాబాద్‌లో ఘనంగా బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థాన వేడుకలని నిర్వహించనున్నాయి.
సెప్టెంబరు 1న నోవాటెల్ హోటల్లో ఈ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది. ఈ వేడుకలకు తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్స్‌తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ స్టార్స్‌ని కూడా పిలిచారు. ఇక పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకలో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబతో పాటు డిప్యూటీ సీఎం పవన్, ఇటు తెలంగాణ సీఎం రేవంత్‌కు కూడా ఇన్విటేషన్ వెళ్లిందని సమాచారం.
అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్‌రామ్‌కు ఆహ్వానం అందలేదని సోషల్‌మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. హరికృష్ణ కుమారులను కావాలనే బాలయ్య పక్కన పెట్టారా అని చర్చంచుకుంటున్నారు. నిజానికి చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి చెందిన ఈవెంట్లకు దూరంగా ఉంటున్నారు. అటు రాజకీయంగానూ జూనియర్ టీడీపీకి సపోర్ట్ చేయడంలేదు. అలాగని వైసీపీకి కూడా నేరుగా మద్దతు ఇవ్వలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కోడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీ వైపు ఉన్నారు. ఇదే విషయంలోనే బాలయ్య, తారక్ ఫ్యాన్స్ నిత్యం వాదించుకుంటారు.
గతంలో ఎలాంటి ఈవెంట్లు జరిగినా తారక్ తన కుటుంబం గురించి చెబుతూ ఉండేవారు. ఎన్టీఆర్ గురించి, బాలయ్య గురించి ప్రస్తావిస్తూ ఉండేవారు. అయితే చాలా కాలంగా జూనియర్ సైలెంట్‌గా ఉంటున్నారు. ‘మా బాబాయ్, మా బాబాయ్’ అంటూ బాలకృష్ణను ఎన్నో సార్లు ఆకాశానికి ఎత్తేసిన నాటి జూనియర్ వేరు.. నేటి తారక్ వేరు..! ఇటు రాజకీయంగానూ టీడీపీకి చాలా దూరం పాటిస్తున్న జూనియర్‌ను బాలకృష్ణ ఈవెంట్‌కు కావాలనే పిలవలేదన్న చర్చ జోరుగా సాగుతోంది.
మరోవైపు మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఫ్యాన్ వార్ కొనసాగుతున్న వేళ ఈ రెండు కుటుంబాలు బాలయ్య బాబు ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌కు ఇన్విటేషన్ వెళ్లింది. చిరు ఎలాగో వస్తారు.. అటు పవన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఓకే వేదికపై బన్నీ , పవన్, చిరంజీవి కనిపించే అవకాశం ఉండడంతో ఈ సీన్ కోసం యావత్ టాలీవుడ్ సర్కిల్‌తో పాటు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 2024 ఏపీ ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థికి బన్నీ సపోర్ట్ చేయడాన్ని పవన్ ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. దీని గురించి ఇప్పటికీ రచ్చ కొనసాగుతూనే ఉండగా బాలకృష్ణ ఈవెంట్లో మెగా, అల్లు కుటుంబాలు ఓకే కనిపించనుండడం కాక రేపుతోంది.