వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. తల్లీ కొడుకుల యుద్ధం! అర్జున్‌ S/O వైజయంతి' టీజర్ చూశారా

కళ్యాణ్ రామ్, సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న అర్జున్‌ S/O వైజయంతి' టీజర్ రిలీజ్ చేశారు. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, సెంటిమెంట్ నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా కనిపించింది. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.

New Update

Arjun Son Of Vyjayanthi Teaser: డెబ్యూ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అర్జున్‌ S/O వైజయంతి'. అశోక క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా , సునీల్ బలుసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా మూవీ టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. 

Also Read:HIT 3: రిలీజ్ కి ముందే అర్జున్ సర్కార్ హవా.. భారీ ధరకు అమ్ముడైన 'హిట్3' డిజిటల్ రైట్స్.. ఎంతంటే

'అర్జున్‌ S/O వైజయంతి' టీజర్ 

తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, సెంటిమెంట్, ఎమోషన్స్ నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా కనిపించింది.  పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తున్నాయి.  ముఖ్యంగా విజయశాంతి , కళ్యాణ్ రామ్ మధ్య సెంటిమెంట్ సీన్స్ హైలైట్ గా అనిపించాయి. ఇందులో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గా నటించగా.. ఆమె కొడుకుగా  కళ్యాణ్ రామ్  నటించారు.  'కర్తవ్యం' సినిమాలో పోలీస్ ఆఫీసర్ వైజయంతి  పాత్రకు   ఒక కొడుకు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ మూవీ స్టోరీని డెవెలప్ చేసినట్లు తెలుస్తోంది.  ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉన్న తల్లీకొడుకులు వృత్తి కారణాల చేత ఎలా దూరమయ్యారు? వారి మధ్య దూరానికి దారితీసిన పరిస్థితులేంటి? మళ్ళీ ఎలా కలుసుకున్నారు అంశాలతో సినిమా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.  

ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు. అజనీష్ లోకనాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Also Read:Suma Chaaaat Show: తమన్ చాట్ ఛాలెంజ్.. సుమ కంటెస్ట్ లో విన్ అవ్వడానికి ఇలా చేయండి?

Advertisment
తాజా కథనాలు