Arjun Son Of Vyjayanthi: కళ్యాణ్ రామ్ సమ్మర్ ట్రీట్.. అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఇదే

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన మోస్ట్ అవైటెడ్ 'అర్జున్ S/O వైజయంతి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. వేసవి విందుగా ఏప్రిల్ 18న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update

Arjun Son Of Vyjayanthi:  నందమూరి కళ్యాణ్ రామ్- లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్  'అర్జున్ S/O వైజయంతి'. 25 ఏళ్ళ క్రితం విడుదలైన 'కర్తవ్యం' సినిమాలో పోలీస్ ఆఫీసర్ వైజయంతి  పాత్రకు   ఒక కొడుకు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కళ్యాణ్ రామ్,  విజయశాంతి మధ్య భావోద్వేగ బంధాన్ని హైలైట్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచింది. 

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

రిలీజ్ డేట్.. 

ఈ క్రమంలో తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సమ్మర్ విందుగా 18న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.  ఇందులో కళ్యాణ్ రామ్ కమాండింగ్ పోజ్‌లో  మెట్లపై కూర్చొని కనిపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రబృందం. అజనీష్ లోకనాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Also Read: బాలయ్య కూడా గుర్తుపట్టనంతగా మారిపోయిన హీరోయిన్!

2022లో  'బింబిసారా ' తో సూపట్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత వచ్చిన డెవిల్, అమిగోస్ చిత్రాలతో ప్లాపులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు  రెండేళ్ల గ్యాప్ తో తర్వాత మళ్ళీ  'అర్జున్ S/O వైజయంతి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో చూడాలి. 

cinema-news | latest-news | Arjun Son Of Vyjayanthi Teaser | kalyan-ram

Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు