Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని వలసదారులపై తన మాట మార్చారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. టెక్ పెట్టుబడిదారులతో కలిసి ఓ పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న ట్రంప్, వలసదారులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ ఇటీవల కాలంలో అమెరికాలో వలసదారులపై చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి భిన్నంగా ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. “యూఎస్ కళాశాలల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారికి తప్పనిసరిగా గ్రీన్ కార్డు ఇవ్వాలి. ఆ కార్డును ఇస్తే వారు కచ్చితంగా అమెరికాలోనే ఉండి దేశానికి ప్రయోజనాన్ని చేకూరుస్తారని… ప్రపంచంలోని తెలివైన వ్యక్తులను అమెరికాలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
జూనియర్ కాలేజీల్లో చదివిన వారికి కూడా గ్రీన్ కార్డులు ఇవ్వాలి. వలసదారుల విషయంలో నేను గతంలో అనుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడానికి కారణం కొవిడ్ మహమ్మారి అని, అగ్రశ్రేణి కాలేజీల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి యూఎస్‌లో ఉండాలనుకునే విదేశీయుల గురించి నాకు తెలుసు. అయితే వారు వీసాలు పొందలేక స్వదేశాలకు వెళ్లాల్సి వస్తుంది.” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also read: ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు బోల్తా..నలుగురి మృతి..ఇంకా!