Canada: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!
కెనడాలోని బ్రాంప్టన్లో ఉన్న తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్లో వెయిటర్, సర్వర్ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.