BIG BREAKING: భారత విద్యార్థులకు ట్రంప్ మరో బిగ్ షాక్.. అలా చేసినా వీసా రద్దు!

అమెరికాలోని భారత విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ప్రతిరోజు క్లాసులకు హాజరు కాకుంటే వీసా రద్దయ్యే అవకాశం ఉందని ఇండియాలోని అమెురికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది.

New Update
US Student Visa 2025

US Student Visa 2025

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  ఈ క్రమంలో అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు పై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే  విద్యా వీసా నిబంధనలు పాటించని వేల మంది ఫారిన్ విద్యార్థులు వీసాలను, చట్టబద్దమైన హోదాలను తొలగించారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని భారత విద్యార్థులకు మరో షాకిచ్చింది ట్రంప్ ప్రభుత్వం.

క్లాసులకు రాకపోతే వీసాలు రద్దు 

 అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యా వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించకపోతే, వీసా రద్దయే అవకాశం  ఉందని హెచ్చరించింది. ప్రతిరోజు క్లాసులకు రాకపోయినా, కోర్సును మధ్యలోనే వదిలేసినా, యూనివర్సిటీలకు ముందస్తు సమాచారం లేకుండా డ్రాపౌట్ అయినా వీసాలు రద్దు రద్దవడమే కాకుండా భవిష్యత్తులో US వీసా దరఖాస్తుకు కూడా అర్హత లేకుండా పోతుందని..  ఇండియాలోని అమెరికన్ ఎంబసీ విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు వీసా నిబంధనల ప్రకారం స్టూడెంట్ స్టేటస్ కాపాడుకోవడం అత్యంత కీలకమని సూచించింది.  వీసా నిబంధనలు పాటించకపోవడం వల్ల భవిష్యత్తులో  ఉద్యోగ వీసాలు (H-1B), పిఆర్ (Green Card) లేదా  ప్రయాణ వీసాలు పొందే అవకాశాలు కోల్పోతారని .

ఇదిలా ఉంటే కొన్ని వారాల క్రితం అమెరికా లోని వందల మంది స్టూడెంట్స్..  ముఖ్యంగా ఇండియన్ విద్యార్థులు  తమ స్టూడెంట్ వీసాలు రద్దయినట్లు, లీగల్ స్టేటస్ ముగిసిపోయినట్లు  గుర్తించారు.  అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం..  ఏప్రిల్ 10 వరకు SEVIS డేటాబేస్‌లో 4,736 మంది విద్యార్థుల వీసా రికార్డులు రద్దు చేసినట్లు వెల్లడైంది. అమెరికాలోని 187 కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో 1,222 మంది విద్యార్థులు  యూనివర్సిటీ సిస్టమ్స్  నుంచి తమ స్టూడెంట్ స్టేటస్ ని కోల్పోయారు. 

విద్యార్థులు పాటించాల్సిన విషయాలు:

  • చదువుతున్న కాలేజీ/యూనివర్సిటీ నుంచి తప్పకుండా హాజరు నివేదికను పాటించాలి 
  • చదువు మానేస్తే, కోర్సు మారిస్తే వెంటనే DSO (Designated School Official) కి తెలియజేయాలి.
  • ఆఫ్-కాంపస్ ఉద్యోగాలు అనుమతి లేకుండా చేయకూడదు.
  • అలాగే సోషల్ మీడియా లేదా ఇతర కార్యకలాపాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దు.

telugu-news | cinema-news | us-embassy | indian-students | indian students in usa | trump immigration policy | Visa Rules for Students

Advertisment
Advertisment
తాజా కథనాలు