/rtv/media/media_files/2025/05/29/8h0QHU9sLmR5VOKlOvtO.jpg)
అమెరికా వెళ్లి చదువుకోవాలనుకోవడం ఇండియాలో చాలామంది విద్యార్థుల కల. ఆ దేశం చుదవుల్లోనే పెద్దన్నే. అమెరికా చదువుకుంటున్న వారిలో చైనా, ఇండియా నుంచి వెళ్లిన వారే ఎక్కువే. ఎలాగైనా అమెరికాలో మాస్టర్స్ చేసి ఉద్యోగం సంపాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంటారు. అదంతా 5 నెలల క్రితం. ఇండియాలో చాలామంది విద్యార్థులు హైయర్ స్టడీస్‌కు అమెరికా వెళ్లం బాబోయ్ అని ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. అమెరికాలో పరిస్థితులు ఒకప్పటిలా లేవు. అన్నీ మారిపోయాయ్. ఇతర దేశస్తులు అమెరికాలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. H1B వీసా మీద అమెరికాలో ఉన్న వారికి గడియ గడియా గండంలాగే ఉంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా 2025 జనవరిలో రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైయాడు. దీంతో ఒక్కసారిగా అమెరికాలో అన్నీ పరిస్థితులు మారిపోయాయి. ట్రంప్ అమెరికన్లకు ఏమోగానీ అక్కడున్న విదేశీలకు మాత్రం పెద్ద తలనొప్పిగా మారాడు.
ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చి మాస్టర్స్ చేద్దామనుకున్న వారికి ట్రంప్ ఎక్కడ లేని నిబంధలు పెట్టడం స్టార్ట్ చేశాడు. అతని నిర్ణయాలతో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కు పిచ్చెక్కిస్తున్నాడు. కొత్తగా క్లాస్ రూమ్ అటెండెన్స్ లేకున్నా, యూనివర్సిటి నుంచి డ్రాపౌట్ అయినా అమెరికా నుంచి వెళ్లగొడతామాని హెచ్చరించాడు. అంతే కాదు వారికి భవిష్యత్‌లో అమెరికా వచ్చే అవకాశం లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే మాస్టర్స్ అయిపోయాక ఉద్యోగం సెర్చ్ చేసుకునే టైంలో పార్ట్‌టైం బాబ్ చేసుకునే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రొగ్రామ్‌ని కూడా తొలగిస్తామని ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అక్కడ చదువుకుంటున్న మన వాళ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. దీంతో ప్రస్తుతం మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినా అమెరికా వెళ్లేందుకు వెనకాడుతున్నారు. లక్షలు అప్పు చేసి అక్కడికి వెళ్లి ఉద్యోగం రాక, వీసా క్యాన్సలై జాబ్ సాధించకుండానే తిరిగొస్తామేమో అని ఇండియన్ స్టూడెంట్స్ భయపడుతున్నారు. అందుకే అమెరికాకు బదులుగా వేరే దేశాలు వెళ్లాలని ఇండియన్ స్టూడెంట్స్ అంటున్నారు. ఈ దేశాల్లో కూడా మంచి ఉన్నత విద్య దొరుకుతుంది.
Also Read : పాకిస్తాన్‌తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు
ఐర్లాండ్
2023-24 విద్యా సంవత్సరంలో ఐర్లాండ్ 40,400మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కు అవకాశం కల్పించింది.- ఇది మునుపటి సంవత్సరం కంటే 15% ఎక్కువ. ఐర్లాండ్ ఉన్నత విద్యా అథారిటీ (HEA) నుండి వచ్చిన డేటా ప్రకారం అక్కడ చదువుకోవాలని భారతీయ విద్యార్థుల కూడా ఆసక్తి చూపుతున్నారట. ఐర్లాండ్‌లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్స్‌యే అగ్ర భాగం. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు రెండింటికి ఐర్లాండ్‌లో ఆదరణ పెరుగుతుంది.
Also Read : తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
నెదర్లాండ్స్
ఇటీవల డచ్ అంతర్జాతీయ విద్యా సంస్థ న్యూఫిక్ ఇచ్చిన డేటా ప్రకారం, నెదర్లాండ్స్ అంతర్జాతీయ విద్యార్థులకు కొత్త ఆప్షన్‌గా వస్తుంది. 2025-26 విద్యా సంవత్సరంలో దేశంలోని విద్యార్థి జనాభాలో అంతర్జాతీయ విద్యార్థులు 16.6% ఉన్నారు. ఇది గత సంవత్సరం 15.9% నుండి పెరిగింది. దాదాపు లక్షా 31వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు డచ్ యూనివర్సిటీల్లో చేరారు.
జర్మనీ
జర్మన్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ (DAAD) ప్రకారం.. 2023–24 వింటర్ సెమిస్టర్‌లో భారతీయ విద్యార్థుల నమోదు రికార్డు స్థాయిలో 49,483కి చేరుకుంది. -ఇది మునుపటి సంవత్సరం కంటే 15.1% పెరిగింది. జర్మనీలో విద్యా వ్యవస్థ బాగా ఉంటుంది. తక్కువ లేదా ట్యూషన్ ఫీజులు లేకపోవడం, జర్మన్‌లో యూకే, యూస్‌లతో పోల్చుకుంటే తక్కువ కాస్ట్ ఆఫ్ లీవింగ్ ఉంటుంది. దీంతో జర్మన్‌లో మాస్టర్ చేయడానికి ఇండియన్ స్టూడెంట్స్ ఆసక్తి చూపుతున్నారు.
Also Read : కవిత వివాదం.. బీజీపీలో బీఆర్ఎస్ విలీనం.. బీఆర్ఎస్ నేత వినోద్ సంచలనం!
ఫ్రాన్స్
ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022లో 6,406 నుండి 2023లో 7,484కి పెరిగింది. అది 2024లో 8,536కి చేరుకుంది. ఫ్రాన్స్‌లో ఆకర్షణీయమైన వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు ఉన్నాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025లో 19 ఫ్రెంచ్ సంస్థలు టాప్ 250లో జాబితా చేయబడ్డాయి. ఫ్రాన్స్ షాంఘై ర్యాంకింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025 టాప్ 500లో 14 సంస్థలు, సబ్జెక్ట్ 2025 ప్రకారం వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వివిధ విభాగాలలో టాప్ 100లో 22 సంస్థలు ఫ్రాన్స్‌లోనే ఉన్నాయి.
సింగపూర్
ఆసియా దేశాల విషయానికి వస్తే, సింగపూర్ భారతీయ విద్యార్థులకు అత్యంత ప్రజాదరణ పొందిన ఎడ్యుకేషన్ డెస్టినేషన్‌గా మారుతోంది. సింగపూర్‌లో 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల భారతీయులు 41% మంది ఉన్నారు. సింగపూర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఆ దేశంలో బలమైన ఉద్యోగ అవకాశాల పెరుగుదల ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తోంది.
Also Read : జూన్ 10 నాటికి జగన్ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నార్వే, స్వీడన్, డెన్మార్క్, స్విజ్జర్‌ల్యాండ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా మంచి స్టాండర్డ్స్‌తో కూడిన ఎడ్యుకేషన్ లభిస్తోంది. ఈ దేశాలు ఉన్నత విద్యను అందించడంలో అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. హై స్కిల్స్, నైపుణ్యంతో కూడిన విద్యను అందిస్తాయి. ఇక్కడ చదివిన వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
us | higher-education | countries | indian-students | indian students in usa | big shock to indian students | donald trump fires on indian students | Indian Students Suffering In USA | irland | singapure | latest-telugu-news | US Foreign Students