Supreme Court : రిపీటైతే తీవ్ర చర్యలుంటాయ్.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్!
రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ జోడో యాత్రలో దివంగత సావర్కర్ ను 'బ్రిటిష్ ఏజెంట్'గా రాహుల్ అభివర్ణించారు. స్వాతంత్య్ర సమరయోధుల్ని అవమానిస్తే చూస్తూ ఉండబోమని, ఇది మళ్లీ రిపీటైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.