Senior Actor Raghu Babu Singing Video : ప్రముఖ సీనియర్ నటుడు, కమెడియన్ రఘుబాబు(Raghu Babu) గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పటి నటుడు గిరిబాబు(Giri Babu) కొడుకైన రఘుబాబు మొదట వర్షం, దిల్ వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తో అలరించి ఆ తర్వాత కమెడియన్(Comedian) గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈయనకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో రఘుబాబు టాలెంట్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?
Also Read : న్యాచురల్ బ్యూటీతో రౌడీ హీరో రొమాన్స్?
రఘుబాబులో ఈ టాలెంట్ కూడా ఉందా?
సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న రఘుబాబులో సింగింగ్ టాలెంట్(Singing Talent) కూడా ఉంది. తాజా వీడియోతో ఇది బయటకొచ్చింది. రఘుబాబు ఓ ఈవెంట్ లో ఏకంగా తమిళ పాట పాడాడు. అచ్చం ప్రొఫెషనల్ సింగర్ పాడితే ఎలా ఉంటుందో అలా తమిళ్ సాంగ్ పాడుతుంటే ఆ ఈవెంట్ లో ఉన్నవాళ్ళంతా మైమరచిపోయారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రఘుబాబు సింగింగ్ టాలెంట్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతూ… రఘుబాబులో ఈ టాలెంట్ కూడా ఉందా?, రఘుబాబు అచ్చం ప్రొఫెషనల్ సింగర్ మాదిరి సన్గ్ అద్భుతంగా పాడారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కళ్ళు మూసుకుని వింటే ఎవరో ప్రొఫెషనల్ సింగర్ పాడారనిపిస్తది. రఘుబాబుగారు 👌👌🎵🎶 pic.twitter.com/2N4trQQaxu
— Harish R.M (@27stories_) May 14, 2024