/rtv/media/media_files/2025/04/09/uDiOeGFNmPTQcOUuZdfA.jpg)
Sapthagiri Mother Photograph: (Sapthagiri Mother)
తెలుగు కమెడియన్ సప్తగిరి ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి చిట్టెమ్మ కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి సప్తగిరి తల్లి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. నేడు తిరుపతిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రముఖ నటుడు సప్తగిరి తల్లి చిట్టెమ్మ గారు కన్నుమూత!
— TeluguOne (@Theteluguone) April 9, 2025
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మంగళవారం తుదిశ్వాస విడిచారు.
ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Rest In Peace 🙏#Saptagiri @MeSapthagiri pic.twitter.com/OrQpauqUsc