Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఆంద్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను అమరావతీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే సీఎం చంద్రబాబు స్థలం కేటాయించారని తెలిపారు. ఏపీలో త్వరలోనే ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు.
bala krishna
Bala Krishna: బాలయ్య ఎన్నికల ప్రచారం.. ఫుల్ జోష్ లో తెలుగు తుమ్ముళ్లు..!
MLA Bala Krishna: హిందూపూర్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ లేపాక్షి మండలంలో తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సడ్లపల్లి, పూలమతి, మానేపల్లి, సిరివరం గ్రామాలలో ఎన్నికల చైతన్య రథంపై రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
Also Read: బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ..!
ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఆయా ప్రాంతాలలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి, రాజకీయ చైతన్యవంతులను చేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదని పేర్కొన్నారు.
Also Read: ఏం తప్పుగా మాట్లాడాను?.. చిరంజీవి గొప్ప నటుడే.. కానీ..!
ఆయన ఆశయానికి అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు ప్రజాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు, వైసీపీ అరాచక పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.
AP Politics: పవన్, బాలయ్య, లోకేశ్ పై పోటీకి మహిళా అభ్యర్థులు.. జగన్ స్కెచ్ అదుర్స్!
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో పార్టీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించారు. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ ఇదే.. ఎవరెవరున్నారంటే?
జగన్ స్పెషల్ ఫోకస్..
ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. అదేంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లకు పోటీగా వైసీపీ తరఫున మహిళా అభ్యర్థులు బరిలోకి దింపడం విశేషంగా మారింది. ప్రతిపక్ష్య ముఖ్య నేతలైన వారిని ఓడించాలనే ఇంటెన్షన్ తో కావాలనే జగన్ ఇలా ప్లాన్ చేశారా లేదంటే అనుకోకుండా ఇలా అభ్యర్థులను ప్రకటించారా అన్న చర్చ మొదలైంది.
పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుండి వంగా గీత అనే అభ్యర్థిని, హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు పోటీగా టీఎన్ దీపిక అనే అభ్యర్థిని, మంగళగిరిలో నారా లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్య అనే అభ్యర్థులను జగన బరిలో దింపాడు. దీంతో కీలక నేతలపై మహిళా అభ్యర్థులను పోటీకి దింపటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలను ఓడించటమే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థులు:
మండపేట – తోట త్రిమూర్తులు- ఓసీ
రామచంద్రాపురం – పిల్లి సూర్య ప్రకాశ్- బీసీ
గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్- ఎస్సీ
కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి – ఓసీ
అమలాపురం – విశ్వరూప్ పినిపే – ఎస్సీ
ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ – బీసీ
రాజోలు – గొల్లపల్లి సూర్యారావు – ఎస్సీ
రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మి – ఎస్టీ
కాకినాడ సిటీ – ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి – ఓసీ
పెద్దాపురం – దావులూరి దొరబాబు – ఓసీ
కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు – ఓసీ
ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు – ఓసీ
పిఠాపురం – వంగా గీత – ఓసీ
జగ్గంపేట – తోట నరసింహం – ఓసీ
తుని – రామలింగేశ్వరరావు దాడిశెట్టి – ఓసీ
రాజమహేంద్రవరం సిటీ – మార్గాని భరత్
రాజానగరం – జక్కంపూడి రాజా – ఓసీ
రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ – ఓసీ
అనపర్తి – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి – ఓసీ
Bala Krishna: అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. వైసీపీ మంత్రులకు బాలయ్య వార్నింగ్
Bala Krishna: టాలీవుడ్ స్టార్ సీనియర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను అధికారం పీఠంపై ఎక్కించారని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ చూపిన బాటలోనే పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీకి ఉన్న బలం కార్యకర్తలేనని బాలయ్య వ్యాఖ్యానించారు.
Also Read: క్యాడ్బరీ డైరీమిల్క్ చాలా ప్రమాదం.. నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ!
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, పలువురు మంత్రులపై తనదైన శైలిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాష్ట్రంలో రైతు ఉనికే లేకుండా చేస్తోందని ఫైర్ అయ్యారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటూ శ్రీ శ్రీ కవితను గుర్తు చేశారు. ఏపీలో పాలన కూడా ఇదే తరహాలో ఉందని కామెంట్స్ చేశారు. టీడీపీ చేసిన మంచి పనులను మెచ్చుకోకుండా, తాము ఏమీ చేయకుండా, కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకే బ్యాచ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని బాలయ్య ధ్వజమెత్తారు.
Also Read: తెలంగాణలో 24 గంటలు కరెంట్..మన రాష్ట్రంలో నాలుగైదు గంటలకు కూడా లేదు: మాజీ ఎమ్మెల్యే
మేం చేసింది ఏమిటో చూపిస్తాం.. మీరేం చేశారో చూపించండి.. చర్చిద్దాం అంటే రారు.. అధికారం ఉంది కదా అని మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. బ్రిటీష్ పాలన తరహాలో కులాలు, మతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇవాళ తాడేపల్లిగూడెం సభకు హాజరైన జన సందోహాన్ని చూస్తుంటే టీడీపీ-జనసేన కూటమి గెలుపు తథ్యం అని చెప్పవచ్చన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Minister Peddireddy: హిందూపురంలో అందుకే ఓడిపోతున్నాం: మంత్రి పెద్దిరెడ్డి
Minister Peddireddy Ramachandra Reddy: శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం, కుప్పంలో టిడిపిని ఓడిస్తామన్నారు. గత మూడు రోజులుగా హిందూపురంలో వైసిపి గెలుపే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి గ్రామ గ్రామానికి వెళ్లి బహిరంగ సభల్లో పార్టీ క్యాడర్ తో మాట్లాడుతున్నారు.
Also Read: వైసీపీ నుండి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఔట్?
ఈసారి హిందూపురంలో టిడిపిని ఓడించకపోతే తన మర్యాద పోతుందన్నారు. అందుకోసమే వైసిపి గెలుపే లక్ష్యంగా ఇంత కష్టపడుతున్నట్లు తెలిపారు. హిందూపురంలో గెలవడానికి మహిళా అభ్యర్థిని బరిలో దింపుతున్నట్లు వెల్లడించారు. ఒక్క చిలమత్తూరు మండలంలోనే 15 వేల మెజారిటీ వస్తుందని ఇక్కడి వైసిపి నేతలు అన్నారన్నారు. అదే జరిగితే ఇక్కడి వైసిపి కార్యకర్తలను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి సన్మానం చేయిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికేతరుడు కావడంతో అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. అందుకే విద్యావంతురాలు స్థానికరాలు బీసీ వర్గానికి చెందిన మహిళా అభ్యర్థిని హిందూపురం నుండి పోటీలో దింపుతున్నామన్నారు.
Also Read: ‘కేశినేని కౌన్ కిస్కా గొట్టం, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి’ ఇందుకోసమే నానికి టిక్కెట్ ఇచ్చారు..
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓట్ల కోసం బంగారు ఇస్తానని కూడా అనొచ్చు ఆయన బూటకపు మాటలు విని ఓట్లేస్తే అభివృద్ధి శూన్యం అవుతుందన్నారు. హిందూపురంలో గ్రూపు తగాదాల వల్ల మా అభ్యర్థులు వరుసగా ఓడిపోవడం జరిగిందన్నారు. వైసీపీలో గ్రూపులన్నీ ఏకం చేశా.. ఇక గెలుపే లక్ష్యంగా హిందూపురంలో పార్టీ క్యాడర్ పనిచేస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Bala Krishna: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ..ఏం మాట్లాడుకున్నారంటే?
Bala Krishna Met CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి వరుసగా శుభాకాంక్షలు తెలపుతున్నారు సినీ సెలబ్రిటీలు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక టాలీవుడ్ నుండి మొదటిగా కలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో కలిసిన చిరంజీవి ముఖ్యమంత్రిగా ఎన్నికయినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఆ తరువాత నేడు సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) తన భార్య అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్‌లోని సీఎం నివాసంలో నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా, సినీ నటులు నందమూరి బాలకృష్ణ(Bala Krishna) తన చిన్న అల్లుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణకి ముందు నుంచి మంచి సంబంధాలు ఉండడంతో వీరిద్దరూ కలిసి కాసేపు చర్చించుకున్నారు.
అంతేకాకుండా, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(PV Sindhu) సైతం తన తల్లిదండ్రులతో తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ను కలుస్తున్నారు. అయితే, త్వరలోనే టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అపాయింట్ మెంట్ ను కూడా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ఆర్జీవీ తల నరుకుతానన్న కొలికిపుడి కోసం ఏపీ సీఐడీ వేట.. నేరుగా ఇంటికి వెళ్లి..!