Bala Krishna: త్వరలో 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై బాలయ్య సందడి..!!
'అన్ స్టాపబుల్ సీజన్ 3' తో సినీ హీరో బాలయ్య మరోసారి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే 'అన్ స్టాపబుల్ సీజన్ 3' మొదలుకానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ ఫస్టు ఎపిసోడ్ లో 'భగవంత్ కేసరి' టీమ్ హంగామా చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మరికొందరు మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ గెస్ట్ గా రానున్నారని కామెంట్స్ చేస్తున్నారు.