హీరో బాలకృష్ణకు ఎమ్మెల్సీ సునీత మాస్ వార్నింగ్.!

హీరో బాలకృష్ణ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ పోతుల సునీత. సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ల లో మహిళలు కనబడితే చాలు.. కడుపైన చేయాలి.. ముద్దైన పెట్టాలనే నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తి బాలకృష్ణ అని మండిపడ్డారు.

New Update
హీరో బాలకృష్ణకు ఎమ్మెల్సీ సునీత మాస్ వార్నింగ్.!

MLC Pothula Sunitha: నంద్యాల జిల్లాలో ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వారి ఎమ్మెల్యే లు మహిళలను చులకన భావంతో చూస్తున్నారని మండిపడ్డారు. హీరో బాలకృష్ణ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల పట్ల ప్రవర్తించిన తీరు చాలా దుర్మార్గమని వ్యాఖ్యనించారు. సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ల లో మహిళలు కనబడితే చాలు.. కడుపైన చేయాలి.. ముద్దైన పెట్టాలి అనే నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తి బాలకృష్ణ అని విరుచుకుపడ్డారు.

Also Read: తాగింది నిజమే.. వీడియో తీసింది అందుకే..యూట్యూబర్ నాని సంచలన ప్రెస్ మీట్!

తమిళ హీరోయిన్ విచిత్ర పట్ల బాలకృష్ణ ప్రవర్తించిన తీరు చాలా నీచంగా ఉందని మండిపడ్డారు. హీరోయిన్ విచిత్ర వయసున్న కూతుర్లు బాలకృష్ణకు ఉన్నారని..ఆమె పట్ల ఇలా ప్రవర్తించడం బాలకృష్ణకు సిగ్గుందా? అంటూ ఫైర్ అయ్యారు. మహిళలను చిత్రహింసలకు గురిచేసేటపుడు బాలకృష్ణకు తన కూతుర్లు గుర్తుకు రారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మహిళల పట్ల బాలకృష్ణ పద్దతి మార్చుకోకపోతే మహిళలందరూ చాటలు, పొరకలతో దాడి చేస్తారని హెచ్చరించారు.

Also read: విజయవాడలో ఫుడ్ కోర్ట్ మాఫియా..జనసేన పోతిన మహేష్ షాకింగ్ కామెంట్స్.!

చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుకమైనింగ్ లో అవినీతి జరిగిందని ఎమ్మార్వో వనజాక్షి ప్రశ్నిస్తే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టి ఈడ్చి కొట్టారని గుర్తు చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ఎమ్మార్వో వనజాక్షికి ఏ మాత్రం న్యాయం చేయలేదని అన్నారు. రాజధాని నడిబొడ్డైన విజయవాడలో కాల్ మని సెక్స్ రాకెట్ ఉదంతంలో ఎంతో మంది మహిళలను రోడ్డు కీడ్చిన చరిత్ర ఉన్న పార్టీ టిడిపి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు