NBK 109: బాలయ్య సినిమాలో మాస్ హీరో.. ఫ్యాన్స్ కు పండగే

'డాకు మహారాజ్' సినిమాలో బాలయ్య పాత్రను మాస్ మహారాజ్ రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని. ఈ వాయిస్ ఓవర్ సినిమా పై నెక్స్ట్ లెవెల్ ఇంప్యాక్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది.

New Update
balayya

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. అందులో బాలయ్య సరికొత్త గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. టీజర్ కాస్త సినిమాపై అంచనాలు పెంచేసింది. 

రవితేజ వాయిస్ ఓవర్.. 

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా భాగం అవుతున్నారట. లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల   సమాచారం ప్రకారం.. 'డాకు మహారాజ్'లో బాలయ్య పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట.

Also Read : 'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ

సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని.. ఈ వాయిస్ ఓవర్ ను మాస్ మహారాజ్ చెప్పబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమా పై నెక్స్ట్ లెవెల్ ఇంప్యాక్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది. మరి ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. 

యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుండగా.. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే?

Also Read: మోహన్ బాబు, మనోజ్ మధ్య కొట్లాట.. స్పందించిన మంచు ఫ్యామిలీ

Also Read:  శ్రీలీల షాకింగ్ డెసిషన్.. కోట్లు ఇచ్చినా ఆ పని చేయదట..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు