అప్పుడే పుట్టిన నవజాత శిశువులు కళ్లు తెరుస్తూ, తల్లి పాల కోసం ఎదురుచూస్తుంటారు. రోజులు గడుస్తున్న కొద్ది వారి శరీర అవయవాలు పెరుగుతుంటాయి. మెల్లిమెల్లిగా దంతాలు వస్తుంటాయి. కానీ ఓ చిన్నారి విషయంలో మాత్రం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పుట్టినప్పుడు ఆ శిశువుకు నోటినిండా 32 పళ్లు వచ్చాయి. ఇది చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ చిన్నారికి పుట్టుకతోనే పళ్లు రావడంపై తల్లి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. అవగాహన కోసమే దానిని షేర్ చేసినట్లు పేర్కొన్నారు.
Also read: మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అన్నా లెజినోవా… హాజరైన పవన్ కల్యాణ్
అయితే ఇలా పుట్టుకతోనే పళ్లు వచ్చే పరిస్థితిని ‘నాటల్ టీత్’ అని అంటారు. ఇలా వస్తే బిడ్డకు అంతగా ప్రమాదం ఉండదు. కానీ పాలిచ్చేటప్పుడు తల్లికి ఇబ్బంది అవుతుంది. ఏదైన పన్ను విరిగిపోతే దాన్ని ఆ చిన్నారి మింగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ వీడియో చూసిన నెటీజన్లు షాక్ అవుతున్నారు. బిడ్డ ఆరోగ్యం బాగుందా.. పెరిగే కొద్ది ఏదైన సమస్యలు వస్తున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే తర్వాత ఆ పాప పళ్లను వైద్యులు తొలగించినట్లు తెలుస్తోంది.
Also Read: కువైట్లో అగ్నిప్రమాదం.. భారతీయ కుటుంబం సజీవదహనం
View this post on Instagram