మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం ఆదివారం జరిగిన మినీ వేలం ముగిసింది. 19 స్లాట్‌ల కోసం జరిగిన ఈ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఇందులో భారత అన్‌క్యాప్‌డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్‌కు భారీ ధర పలికింది. గుజరాత్ జెయింట్స్ ఆమె కోసం రూ.1.90 కోట్లు వెచ్చించింది. సిమ్రాన్ బేస్ ధర రూ.10 లక్షలతో ప్రారంభం కాగా.. గుజరాత్, ఢిల్లీ ఆమె కోసం పోటీ పడ్డాయి. చివరికి గుజరాత్ అత్యధిక ధరతో ఆమెను దక్కించుకుంది. Also Read: బెంగళూరు టెకీ కేసు.. భార్య, అత్త, బావమరిది అరెస్టు WPL 2025 Auction ఇక వెస్టిండీస్ ఆర్‌రౌండర్ డియాండ్రా డాటిన్‌ను కూడా గుజరాత్ జెయింట్స్ రూ.1.70 కోట్లతో సొంతం చేసుకుంది. ఈమె బేస్ ధర రూ.50 లక్షల కాగా.. యూపీ వారియర్స్‌తో గుజరాత్ పోటీ పడింది. చివరికీ గుజరాతే ఆమెను దక్కించుకుంది. ఇక భారత ప్లేయర్లైనా స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ, శుభా సతీష్ అన్‌సోల్డ్ అయ్యారు. అలాగే విదేశీ క్రికెటర్లు హీథర్ నైట్, లిజెల్ లీ, లారెన్ బెల్, సారా గ్లెన్, కిమ్ గార్త్ కూడా అన్‌సోల్ట్‌గా మిగిలారు. Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్! ఇదిలాఉండగా.. భారత్‌కు చెందిన 16 ఏళ్ల జి కమలిని సైతం భారీ ధర పలికింది. తమిళనాడు వికెట్‌కీపర్ అయిన ఈమె కనీస ధర రూ.10 లక్షల కాగా.. ఢిల్లీ, ముంబయి జట్లు పోటీ పడ్డాయి. చివరికి ముంబయి కమిలిని ఏకంగా రూ.1.60 కోట్లకు సొంతం చేసుకుంది. ఈమె అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో 8 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 311 పరుగులు చేసి సెకండ్ టాప్ స్కోరర్‌గా సత్తా చాటింది. అలాగే పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా కూడా బౌలింగ్ చేస్తుంది. Also Read: ఆప్ తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్, అతిషి ఎక్కడి నుంచి పోటీ అంటే ? Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం