Champions Trophy 2025: టీమిండియాతో సెమీస్‌లో ఆడబోయే జట్టు ఏదీ? సమీకరణాలు ఇవే!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. టీమిండియాతో పాటుగా గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెట్టగా, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది.  ఇక నాలుగో జట్టు ఎవరెనది ఆసక్తికరంగా మారింది.

New Update
icc india

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) లో భాగంగా టీమిండియా (Team India) ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. టీమిండియాతో పాటుగా గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెట్టగా, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది.  ఇక నాలుగో జట్టు ఎవరెనది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు (శ‌నివారం ) జ‌రుగ‌నున్న ఇంగ్లండ్ వ‌ర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌తో తేల‌నుంది. గ్రూప్ బీ నుంచి సౌతాఫ్రికాకే సెమీస్ చేరుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

Also Read :  పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం

టీమిండియాతో ఆడబోయే జట్టు ఏదీ?

సెమీఫైనల్ లో టీమిండియాతో ఆడబోయే జట్టు ఏది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  రేపు న్యూజిలాండ్ తో టీమిండియా మ్యాచ్ ఆడనుంది.  ఇందులో టీమిండియా గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంటుంది. అప్పుడు గ్రూప్ బీలో రెండో స్థానంలో ఉన్న జ‌ట్టుతో టీమిండియా సెమీస్‌తో త‌ల‌ప‌డాల్సి ఉంటుంది.ఈ లెక్కన చూసుకుంటే ఇంగ్లాండ్‌ను సౌతాఫ్రికా ఓడిస్తే అప్పుడు  గ్రూప్ బీలో సౌతాఫ్రికా నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లోకి చేరుకుంటుంది. 

అప్పుడు ఇండియా ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా (Australia) ఉంటుంది.  ఒక‌వేళ సౌతాఫ్రికా ఓడిపోతే ర‌న్ రేట్  పరంగా సెమీ ఫైనల్ లోఇండియాకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఇక న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతే అప్పుడు ఏదో ఒక జ‌ట్టుతో సెమీస్‌లో టీమిండియా త‌ల‌ప‌డుంది.

Also Read :  డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!

ఛాంపియన్స్ ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లు:

ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్
మార్చి 1 - దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ
మార్చి 2 - న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
మార్చి 4 - సెమీ-ఫైనల్-1, ఇండియా vs టీబీడీ, దుబాయ్
మార్చి 5 - సెమీ-ఫైనల్-2, లాహోర్
మార్చి 9 - ఫైనల్, లాహోర్ (భారతదేశం ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో జరుగుతుంది)
మార్చి 10 - రిజర్వ్ డే 

Also read :   రోజాకు హ్యాండ్ ఇచ్చిన జగన్ .. సోషల్ మీడియాలో మాజీ మంత్రి సంచలన ట్వీట్!

Also read :  ఏడు పాయల ఆలయంలో అపశృతి.. ఇద్దరు భక్తుల మృతి!

Advertisment
తాజా కథనాలు