/rtv/media/media_files/2025/02/27/WDAIS8XJj9HK2D6iYwmg.jpg)
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి రోజా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది. ఇంతకు ఆమె ఏం ట్వీట్ చేశారంటే.. హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది.. చేస్తే మర్చిపోతారు.. హెల్ప్ చెయ్యకపోతే గుర్తు పెట్టుకుంటారంటూ రోజా 2025 మార్చి 01వ తేదీ శనివారం తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో రోజా ట్వీట్ వెనుక అర్థం ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది.
`'హెల్ప్' అనేది
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 1, 2025
చాలా విచిత్రమైంది.
చేస్తే మరచిపోతారు.
చేయ్యకపోతే
గుర్తుపెట్టుకుంటారు.`#quoteoftheday pic.twitter.com/2xyd5bd4QB
జగనన్న హ్యాండ్ ఇచ్చాడా?
రోజాకు జగనన్న హ్యాండ్ ఇచ్చాడా అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గత వైసీసీ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై ఇష్టానుసారంగా మాటలు వదిలిన వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతుండటంతో నెక్ట్స్ రోజా అరెస్ట్ అంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో ఎన్డీయే ప్రభుత్వంలో రోజా ఎవరిదైనా హెల్ప్ అడిగిందా అంటూ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం నడుస్తోంది. మొత్తానిరి రోజా పెట్టిన ఈ ట్వీట్ పెద్ద కాకరేపిందనే చెప్పాలి.
Also Read : మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా?
రెచ్చిపోయి మాట్లాడిన రోజా!
వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా బహిరంగ కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్ లపై రెచ్చిపోయి మాట్లాడారు. అసభ్యకరంగా వ్యక్తిగత దూషణలు కూడా దిగారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోజా లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు చర్చ నడుస్తోంది. రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్రాలో భారీ స్కామ్ జరిగినట్లుగా అప్సట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆత్యాపాత్యా చీఫ్ ఆర్డీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో రోజాకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని వార్తలు తెరపైకి వచ్చాయి.
Also read : SLBC: లోపల కార్మికులు బతికే ఉన్నారా? లేదా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన!