/rtv/media/media_files/2025/01/30/jUz7yOI3ciC6GhSq7vJa.jpg)
Arun Jaitley Stadium
న్యూఢిల్లీ (New Delhi) లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, రైల్వేస్ మధ్య రంజీ మ్యాచ్ ప్రారంభమైంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత కోహ్లీ దేశవాళీ మ్యాచ్ ఆడుతుండటంతో అతని ఆటను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. స్టేడియంలోకి అభిమానులు ఎంట్రీ ఇచ్చే 16 గేటు వద్ద పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాటకు దారి తీసింది. దీంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీస్ బైక్ ధ్వంసమైంది. సెక్యూరిటీ గార్డుతో సహా కనీసం ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన అభిమానులకు గేటు దగ్గర డీడీసీఏ సెక్యూరిటీ, పోలీసులు చికిత్స అందించారు.
Also Read : కేసీఆర్ పాలనే బాగుంది.. సొంత 'X' ఖాతా పోల్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్!
Virat Kohli - Arun Jaitley Stadium
Aura ♾️! 👑🙇🏼♂️
— Royal Challengers Bengaluru (@RCBTweets) January 30, 2025
Huge crowd outside the Arun Jaitley Stadium for the Delhi Railways Ranji Clash! 😱#PlayBold #ನಮ್ಮRCB #ViratKohli
pic.twitter.com/gd99OLpzN9
Also Read : దగ్గుబాటి కుటుంబంలో విషాదం
వాస్తవానికి ఈ మ్యాచ్ చూసేందుకు ఇంతమంది వస్తారని ఢిల్లీ క్రికెట్ నిర్వాహకులు కూడా ఊహించలేదు. కోహ్లీ (Virat Kohli) ఆట చూసేందుకు ఇంటర్ నేషనల్ మ్యాచ్ కూడా లేనంతగా అభిమానులు రావడంతో స్టేడియం కిక్కిరిసింది. ఇక కోహ్లి తన చివరి రంజీ మ్యాచ్ 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఆడాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం రైల్వేస్ జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన రైల్వేస్ జట్టు 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
Also Read : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
ఢిల్లీ (ప్లేయింగ్ XI): అర్పిత్ రాణా, సనత్ సాంగ్వాన్, విరాట్ కోహ్లి, యశ్ ధుల్, ఆయుష్ బడోని(సి), ప్రణవ్ రాజువంశీ(w), సుమిత్ మాథుర్, శివం శర్మ, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, సిద్ధాంత్ శర్మ
రైల్వేస్ (ప్లేయింగ్ XI): అంచిత్ యాదవ్, వివేక్ సింగ్, సూరజ్ అహుజా(సి), ఉపేంద్ర యాదవ్(w), మహ్మద్ సైఫ్, భార్గవ్ మెరాయ్, కర్ణ్ శర్మ, రాహుల్ శర్మ, హిమాన్షు సాంగ్వాన్, అయాన్ చౌదరి, కునాల్ యాదవ్
Also Read : ఏపీలో ఇక నుంచి అర్థరాత్రి 12 వరకు హోటల్స్...మంత్రి కీలక ప్రకటన!