Kohli Vs Bcci: ఫ్యామిలీకంటే ఆటే ముఖ్యమా.. తలా తోక లేని రూల్స్ పెట్టొద్దు!

బీసీసీఐ రూల్స్‌పై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ టూర్ల సమయంలో భార్యపిల్లలు ట్రావెల్ చేయకుండా కొత్త నిబంధన పెట్టడంపై ఫైర్ అయ్యాడు. 45 రోజుల్లో 14 రోజులు అనుమతించడం సరైనది కాదన్నాడు. తలా తోక లేని నిర్ణయాలు ఎవరికి ఉపయోగమన్నాడు.

New Update
kohli bcci

kohli bcci Photograph: (kohli bcci)

Kohli Vs Bcci: బీసీసీఐ రూల్స్‌పై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ టూర్ల సమయంలో భార్యపిల్లలు ట్రావెల్ చేయకుండా కొత్త నిబంధన పెట్టడంపై ఫైర్ అయ్యాడు. 45 రోజుల్లో 14 రోజులు మాత్రమే అనుమతించడం సరైనది కాదన్నాడు. తలా తోక లేని నిర్ణయాలు ఎవరికి ఉపయోగమని ప్రశ్నించాడు. 

తలతిక్క రూల్స్‌..

ఈ మేరకు ఐపీఎల్-2025 సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్రెయినింగ్ క్యాంప్‌లో విరాట్ జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ... భారత క్రికెట్‌ను ఉద్దేశించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత బీసీసీఐ రూల్స్ మార్చడంపై ఘాటుగా స్పందించాడు. 45 రోజుల టూర్ ఉంటే అందులో 14 రోజులు మాత్రమే ప్లేయర్ల భార్య పిల్లలను అనుమతిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నాడు. తలా తోక లేని నిర్ణయాల వల్ల ఎవరికి ఉపయోగమని, ఈ రూల్స్‌తో ఏం సాధించారంటూ అసహనం వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులతో గడపడం ఆటగాళ్లకు చాలా ముఖ్యమని, దీనిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించాడు. 

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

ఆటగాళ్ల మానసిక స్థితిపై ఎంత సానుకూల ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదు. ఆటలో విఫలమైనపుడు నిరాశలో కూరుకుపోతాం. ఏకాంతంగా కూర్చొని బాధపడుతూ ఉండాలని ఎవరు కోరుకోవట్లేదు. కఠిన సమయాల్లో కుటుంబంతో గడిపితే త్వరగా కోలుకొని తిరిగి పునరుత్తేజం పొందొచ్చు. ఆట మీద ఫోకస్ పెట్టొచ్చు. నేను నా ఫ్యామిలీతో గడిపే చిన్న అవకాశాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోను అని కుండ బద్ధలు కొట్టేశాడు కింగ్. 

ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు