/rtv/media/media_files/2025/04/24/48R9o0ruKLUT7QLgZ60C.jpg)
rcb vs rr virat kohli
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌లో భాగంగా ఇవాళ 42వ మ్యాచ్ జరుగుతుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లతో దుమ్ము దులిపేశాడు. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన కోహ్లీ పరుగుల వరద రాబట్టాడు.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
కోహ్లీ పరుగుల వరద
32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
రికార్డు మిస్
కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్‌దత్ పడిక్కల్ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
IPL 2025 | rcb-vs-rr | virat-kohli | latest-telugu-news | telugu-news