/rtv/media/media_files/2025/04/29/dxFz6hzPRciQXseuVLw3.jpg)
vaibhav suryavanshi about parents
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు బ్యాటర్, 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవన్షి విజృంభించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇంత చిన్న వయస్సులో బలం పూర్తిగా బాదిన సిక్సర్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా, ఎంతటి ఎక్స్‌పీరియన్స్ కలిగిన వారైనా వైభవ్ వదిలిపెట్టలేదు. ఏకంగా 35 బంతుల్లో సెంచరీ కొట్టి పరుగుల వరద పెట్టించాడు. 101 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరిన వైభవ్‌పై ప్రస్తుతం ప్రసంశల వర్షం కురుస్తోంది.
Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం
ఈ అభినందనలు అమ్మా నాన్నలకే
పలువురు స్టార్ క్రికెటర్లు వైభవ్ సూర్యవన్షి అద్భుతమైన ఆట ప్రదర్శనను కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్ అనంతరం వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నాడు. తాను ఇప్పటి వరకు సాధించిన ప్రతి విజయం వెనక తన అమ్మా, నాన్నల కష్టం ఉందని అన్నాడు. ఇప్పుడు తనపై వస్తున్న అభినందనలు తన అమ్మా నాన్నలకే ఎక్కువగా చెందుతాయని తెలిపాడు. వారు ఎన్నో కష్టాలు అనుభవించారని తెలిపాడు. కష్టం, సమయం, ఆస్తి, ఆశయం, ఆశ అంతా తనపైనే పెట్టారని అన్నాడు.
𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗
— IndianPremierLeague (@IPL) April 29, 2025
He announced his arrival to the big stage in grand fashion 💯
It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨
Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2
Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!
అమ్మకు 3 గంటలే నిద్ర
తాను ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే అందుకు తన తల్లిదండ్రులే కారణం అని చెప్పుకొచ్చాడు. తన అమ్మ తనకోసం రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించేవారని పేర్కొన్నారు. అంతేకాకుండా తన తల్లి కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోయేవారని తెలిపాడు. తనను ఒక మంచి క్రికెటర్‌గా చూసేందుకు తమకున్న పంట పొలాన్ని సైతం అమ్మేశాడని పేర్కొన్నాడు.
Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!
నాన్న ఉద్యోగం మానేశారు
అదిమాత్రమే కాకుండా తన క్రికెట్ కోసం తన తండ్రి ఉద్యోగాన్ని సైతం వదిలేశారని.. ఆ సమయంలో తన ఫ్యామిలీని వాళ్ల అన్నయ్య ఒక్కడే పోషించాడని పేర్కొన్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాం.. ఏ సమయంలోనైనా తన తండ్రి మద్ధతుగా నిలిచేవారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఫలితం కేవలం అమ్మానాన్నల వల్లే వచ్చింది అని వెల్లడించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
vaibhav-suryavanshi | vaibhav | RR Vs GT | latest-telugu-news | telugu-news