పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి.. సింగిల్ రన్‌కే IPL స్టార్ ఔట్

అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌కు పాక్ షాక్ ఇచ్చింది. ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో భారత్‌ను పాక్ ఓడించింది. దీంతో భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో డిసెంబరు 2న జపాన్‌తో తలపడనుంది.

New Update
Under 19 asia cup

దుబాయ్ వేదికగా అండర్ -19 ఆసియా కప్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ - భారత్ మధ్య తొలి మ్యాచ్‌ ఇవాళ (నవంబర్ 30) జరిగింది. ఈ మొదటి మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో యువ భారత్ 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

తొలి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. పాక్ ఆటగాడు షాజైబ్ ఖాన్ చెలరేగిపోయాడు. 147 బంతుల్లో 159 పరుగులు చేశాడు. 10 సిక్స్‌లు, 5 ఫోర్లతో పరుగుల వర్షం కురిపించాడు. 

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

ఇక మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ సైతం హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో వీరిద్దరి తొలి వికెట్‌కు 160 పరుగుల పాట్నర్‌షిప్ నమోదు అయింది. ఇక ఎప్పుడైతే తొలి వికెట్ పడిందో.. భారత్‌కు సరికొత్త ఊపు వచ్చింది. భారత బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు తీశారు. ఏకంగా సమర్త్ నాగరాజ్ 3, ఆయుశ్ మాత్రే 2, కిరణ్ 1, యుధజిత్ 2 వికెట్లు పడగొట్టారు. 

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

పాకిస్తాన్ బ్యాటింగ్ అనంతరం భారత్ 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. మొదటి నుంచే భారత యువ ఆటగాళ్లు తడబడ్డారు. 28 పరుగులకే ఓపెన్లు ఆయిష్ మాట్రే, వైభవ్ సూర్యవంశీ ఓటయ్యారు. ఐపీఎల్ మెగా వేలంలో దాదాపు రూ1.10 కోట్లకు అమ్ముడు పోయిన 13 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. 9 బంతులు ఎదుర్కొని కేవలం 1 రన్ మాత్రమే చేసి ఔటయ్యాడు. 

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నిఖిల్ కుమార్ (67) సహా మిగతా బ్యాటర్లెవ్వరూ ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయారు. ఇక చివరకు భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌట్ అయింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు