ఇలాగే ఆడితే ఈసారి కప్ మాదే : RCB కెప్టెన్ పాటీదార్

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీకి తొలి విక్టరీ కొట్టింది. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రజత్ పాటిదార్ మాట్లాడుతూ..  టోర్నీలో ఇలాగే గెలుచుకుంటూ పోతే టైటిల్ తమదేనన్నాడు.

New Update
patidar rajat

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీకి తొలి విక్టరీ కొట్టింది. శనివారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రజత్ పాటిదార్ మాట్లాడుతూ..  టోర్నీలో ఇలాగే గెలుచుకుంటూ పోతే టైటిల్ తమదేనన్నాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడికి గురయ్యానని పాటీదార్ వెల్లడించాడు. కోహ్లీలాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టమని వెల్లడించాడు. అతడు క్రీజులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుందని తెలిపాడు. విరాట్ నుంచి నేర్చుకునేందుకు ఇది తనకు ఓ గొప్ప అవకాశంగా ఫీల్ అవుతున్నాని తెలిపాడు. అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన స్పిన్నర్ కృనాల్ పాండ్యాను కూడా పాటిదార్ ప్రశంసించాడు.

Also Read :  జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్

Also Read :  అబుదాబి స్వామి నారాయణ్ మందిర్ లో అల్లు అర్జున్.. అక్కడ ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్

ఈ సాల కప్ నమ్దే

ఇక ఆర్సీబీ గెలుపుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.  ఈ సాల కప్ నమ్దే కోరిక ఈసారి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీకి మంచి బౌలింగ్ యూనిట్ ఉందన్న పఠాన్..   కచ్చితంగా టాప్-4లో ఉంటారని తెలిపాడ. ఫస్ట్ మ్యాచ్‌లో దక్కిన శుభారంభాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నానని వెల్లడించాడు.   కెప్టెన్ పాటీదార్ రిస్కులు తీసుకుంటున్నారని...   అతనిలో తనకు నచ్చేది అదేనని పేర్కొన్నాడు.  

Also Read :  తల్లి డైరెక్షన్‌.. కొడుకులు యాక్షన్‌.. షేక్​ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్‌

సొంతగడ్డపై కోల్‌కతా ఓటమి

డిఫెండింగ్‌ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ను సొంతగడ్డపై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 16.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్‌ కోహ్లీ  36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 పరుగుల కొట్టి నాటౌట్ గా నిలిచాడు.  ఫిల్ సాల్ట్‌ 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56 పరుగులు చేయగా..కెప్టెన్ రజత్‌ పటీదార్‌ 16 బంతుల్లో 34 పరుగులు చేసి రాణించాడు. అంతకుముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  20 ఓవర్లకు గానూ 8  వికెట్ల నష్టానికి 174  పరుగులు చేసింది.

Also read :  కేసీఆర్కు దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది.. బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

 

ipl-2025 | rajat-patidar | kkr-vs-rcb | telugu-cricket-news | latest-telugu-news | telugu-sports-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు