BCCI : శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తాజాగా కీలక  ప్రకటనను విడుదల చేసింది.

New Update
iyer

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తాజాగా కీలక  ప్రకటనను విడుదల చేసింది. క్యాచ్ పట్టుకునే క్రమంలో అయ్యర్‌కు కడుపుకు బలమైన గాయం తగిలినట్లు బోర్డు వెల్లడించింది. అక్టోబర్ 25వ తేదీన సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్‌కు ఎడమ దిగువ పక్కటెముకల ప్రాంతంలో గాయం తగిలింది. స్కానింగ్‌లలో అయ్యర్ ప్లీహం అవయవానికి చీలిక ఏర్పడి, అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. గాయాన్ని వెంటనే గుర్తించి, రక్తస్రావాన్ని వెంటనే ఆపడం జరిగింది. ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉంది . అతను బాగా కోలుకుంటున్నాడని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు.

ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు

బీసీసీఐ మెడికల్ టీమ్ సిడ్నీ, భారత్‌లోని వైద్య నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ అయ్యర్ ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది. భారత జట్టు వైద్యుడు అయ్యర్‌తో కలిసి సిడ్నీలోనే ఉండి రోజువారీ ఆరోగ్య పురోగతిని గమనిస్తున్నారు. అంతర్గత రక్తస్రావం కారణంగా మొదట ఐసీయూలో చికిత్స అందించిన అయ్యర్‌ను, ఆరోగ్యం మెరుగుపడటంతో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చినట్లు సమాచారం. ఈ గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ప్లీహం గాయం సున్నితమైనది కావడంతో, పూర్తిగా కోలుకుని మైదానంలోకి తిరిగి రావడానికి కనీసం మూడు నెలల వరకు సమయం పట్టవచ్చని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు