IND vs AUS : ఆసీస్‌పై టీమిండియా ప్రతీకార పోరు.. నేడు  తొలి టీ20 మ్యాచ్‌

వన్డే సిరీస్‌లో ఎదురైన పరాజయం తర్వాత, భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్దమవుతోంది. నేడు ఇరు జట్ల మధ్య కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది.  

New Update
ind vs aus

IND vs AUS: వన్డే సిరీస్‌లో ఎదురైన పరాజయం తర్వాత, భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్దమవుతోంది. నేడు ఇరు జట్ల మధ్య కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది.  ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 1:15 గంటలకు జరుగుతుంది.టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వన్డే సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న జస్ ప్రీత్ బుమ్రా టీ20 సిరీస్‌తో తిరిగి జట్టులోకి రావడం భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. 

Also Read: తుఫాన్‌ బీభత్సం కోనసీమలో పెను విలయం.. లైవ్ అప్ డేట్స్!

వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్ ఇరు జట్లకూ కీలకం కానుంది.టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు ఆడిన 32 మ్యాచ్‌లలో భారత్ 20 విజయాలు సాధించింది. వన్డే సిరీస్‌లో ఆశించిన మేరకు రాణించలేకపోయిన భారత్, పొట్టి ఫార్మాట్‌లో మాత్రం యువ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. సూర్య ఫామ్ జట్టును కాస్త కలవరపెడుతుంది. ఆసియా కప్‌లో అతను 7 మ్యాచ్‌ల్లో 72 పరుగులు మాత్రమే చేశాడు. ఇక  వన్డేలతో పోలిస్తే టీ20ల్లో ఆస్ట్రేలియా బలంగా కనిపిస్తోంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌పై భారీ అంచనాలున్నాయి. వన్డేల్లో రాణించలేకపోయిన ట్రావిస్‌ హెడ్‌.. టీ20ల్లో చెలరేగుతాడని జట్టు ఆశిస్తోంది.

Also Read: తీరం దాటిన మొంథా తుపాను.. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

జట్ల అంచనా 

భారత్ (అంచనా): శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్/జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్/కుల్దీప్ యాదవ్.

ఆస్ట్రేలియా (అంచనా): ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, తన్వీర్ సంఘా. (గ్లెన్ మాక్స్‌వెల్ మొదటి రెండు టీ20లకు అందుబాటులో ఉండడు).

Also Read: సైక్లోన్ మొంథా ఎఫెక్ట్.. ఈ జిలాల్లో స్కూల్స్ క్లోజ్..!

మనుకా ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటికీ, స్పిన్నర్లకు కూడా కొంత సహాయం లభించే అవకాశం ఉంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు సుమారు 150 పరుగులుగా ఉంది. బుధవారం వర్షం పడే సూచనలున్నా.. మ్యాచ్‌ సమయానికి ఇబ్బంది లేకపోవచ్చని తెలుస్తోంది.

Also Read: 'బాహుబలి: ది ఎపిక్' తుఫాన్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కొత్త ట్రైలర్..

Advertisment
తాజా కథనాలు