Deepti Sharma : ఈ అవార్డును వాళ్లకు అంకితం ఇస్తున్నా.. దీప్తి శర్మ ఎమోషనల్!

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఎమోషనల్ అయ్యారు.

New Update
deepthi

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఎమోషనల్ అయ్యారు. ఈ విజయాన్ని, ఈ అవార్డును తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శన చేసిన దీప్తి శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'  అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "ఈ ట్రోఫీని నేను మా అమ్మకు, నాన్నకు అంకితం చేస్తున్నాను" అని కన్నీటి పర్యంతమయ్యారు. 

52 పరుగుల తేడాతో గెలిచి

ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 52 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ బ్యాటింగ్‌లో కీలకమైన 58 పరుగులు చేయడమే కాకుండా..  ఆ తర్వాత బౌలింగ్‌లో అద్భుతమైన 5 వికెట్లు (5/39) తీసి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు. "నాకు ఏ పాత్ర ఇచ్చినా నేను ఎప్పుడూ ఆనందిస్తాను. నాకు సవాళ్లు ఇష్టం - నేటి పరిస్థితికి అనుగుణంగా నేను ఆడాల్సి వచ్చింది. బ్యాట్, బంతి రెండింటిలోనూ నా పాత్రను ఆస్వాదించాను" అని మ్యాచ్ తర్వాత జరిగిన ప్రదర్శనలో దీప్తి చెప్పింది.

దీప్తి ఈ టోర్నమెంట్‌లో మొత్తం 215 పరుగులు చేసి, 22 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచారు. ఒకే ప్రపంచ కప్‌లో 200లకు పైగా పరుగులు, 20 కంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.  దీప్తి శర్మ తల్లిదండ్రులకు ఈ ట్రోఫీని అంకితం చేయడం భారతీయ సంస్కృతికి అద్దం పడుతోంది. తన కెరీర్ ఆరంభం నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం, మద్దతు వెలకట్టలేనిదని ఆమె తెలిపారు. ఈ విజయం కోట్లాది మంది భారతీయ మహిళలకు స్ఫూర్తినిస్తుందని క్రీడా పండితులు కొనియాడారు.

విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఫైనల్‌లో వారి ప్రదర్శన స్కిల్, ఆత్మ విశ్వాసానికి ప్రతీక. ఈ విజయం భవిష్యత్ ఛాంపియన్‌లకు స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు. ‘మన బిడ్డలు దేశాన్ని గర్వపడేలా చేశారు. ఛాంపియన్లకు అభినందనలు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విన్ చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీ చరణి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు