Rishabh Pant: ధోనీని రీప్లేస్ చేయడం కష్టం.. అతడు దేశానికి హీరో: పంత్

MS ధోనీపై రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు రెండుసార్లు వరల్డ్ కప్‌ను అందించిన సారథిగా ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రశంసలు కురిపించాడు. ధోనీ దేశానికి హీరో అని, అతడిని రీప్లేస్ చేయడం కష్టమని అన్నాడు. ఆ దిశగా తాను సాగుతానని తెలిపాడు.

New Update
Interesting Comments On MS Dhoni

Rishabh Pant Interesting Comments On MS Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని.. ఈ పేరు వింటే క్రికెట్ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహం. అతడు గ్రౌండ్‌లో అడుగుపెడితే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. ధోని కీపింగ్ చేస్తుంటే ప్రత్యర్థి బ్యాటర్లలో టెన్షన్ టెన్షన్. ఇక ధోని బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి వచ్చాడంటే.. అరుపులు, కేకలతో సందడే సందడి. 

ఇది కూడా చూడండి: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

ఇలా అతడి ఆటకు, సైలెన్స్ డెసిషన్‌కు దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే టీమిండియా జట్టులోనూ ధోనీ అంటే అభిమానించే వారు, గౌరవించే వారు లేకపోలేదు. ఆయనను స్పూర్తిగా తీసుకుని ఆడేవారు టీమిండియా జట్టులో చాలా మందే ఉన్నారు. అందులో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఒకరు. 

ధోనీపై ప్రశంసల వర్షం

పంత్ తాజాగా ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టుకు రెండు సార్లు వరల్డ్ కప్‌ను అందించిన సారథిగా ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని కొనియాడాడు. అంతేకాకుండా ధోనీని రీప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదని.. అది చాలా కష్టమని పేర్కొన్నాడు. అయితే ఆ దిశగా తాను సాగుతానని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి:  కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా

ధోనీ దేశానికి హీరో

ధోనీ దేశానికి హీరో అని ప్రశంసించాడు. అతడి నుంచి వ్యక్తిగతంగా ఎన్నో అంశాలను నేర్చుకున్నానన్నాడు. జట్టులో ధోనీ ఉన్నాడంటే ఎంతో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా తానెప్పుడూ ధోనీతో తన రికార్డుల విషయాన్ని పోల్చుకోనని చెప్పుకొచ్చాడు. ఇక తనకేదైనా సమస్య ఉంటే.. నేరుగా ధోనీతోనే పంచుకుంటానని.. దానికి పరిష్కారం కూడా దొరుకుతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు