NTR హీరోయిన్ గా అచ్చ తెలుగు అందాలరాశి, కూచిపూడి నర్తకి 'వీణా రావు'

వైవీఎస్ చౌద‌రి దర్శకత్వంలో నంద‌మూరి నాలుగో త‌రం జానకి రామ్ కుమారుడు ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ మూవీలోని హీరోయిన్ ని పరిచయం చేశారు మేకర్స్. ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి వీణా రావ్ నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update

Veenah Rao:  నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హరికృష్ణ మనవడు,  జానకిరామ్ కుమారుడు ఎన్టీఆర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ బ్యానర్ పై  వైవీఎస్ చౌదరి సతీమణి గీత నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అతని స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. 

Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

హీరోయిన్ గా వీణా రావు 

అయితే ఈ మూవీ నుంచి హీరోయిన్ ని పరిచయం చేశారు మేకర్స్. ఎన్టీఆర్ సరసన యంగ్ బ్యూటీ, అచ్చ తెలుగమ్మాయి వీణా రావు కథనాయికగా నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అచ్చ తెలుగు అందాలరాశి,  కూచిపూడి నర్తకి అంటూ వీణా రావు ఫస్ట్ లుక్ షేర్ చేశారు. వీణారావు నటనతో పాటు కూచిపూడి డాన్సర్ గా కూడా ప్రావీణ్యం పొందింది. శనివారం వీణారావు ఫస్ట్‌ లుక్‌ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్‌లు లాంచ్‌ చేశారు. ఈ లాంచ్ ఈవెంట్ కార్యక్రమానికి నిర్మాతలు స్వప్నదత్‌, సుప్రియ యార్లగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? 

Advertisment
Advertisment
తాజా కథనాలు