/rtv/media/media_files/2025/02/23/448xE478g9CFu5Dr5lv7.jpg)
Subhman Gill Run Out Today
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఇచ్చిన లక్ష్యాన్ని భారత్ ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీనే. కానీ ఓపెన్ శుభ్ మన్ గిల్ కూడా మెరుపులు మెరిపించాడు.
దూకుడుగా ఆడిన గిల్..
మంచి ఫామ్ లో ఉన్న గిల్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఈ ఊపులోనే 46 పరుగులు కూడా చేశాడు. అయితే ఇంకా నాలుగు పరుగులు చేస్తే హాఫ్ సెంచరీ అయిపోతుంది అనగా...పాక్ బౌలర్ అబ్రార్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికే శుభ్ మన్ గిల్, విరాట్ ఆటతో పాక్ బౌలర్లు అసహనంగా తయారయ్యారు. మ్యాచ్ తమ చేతుల్లో నుంచి వెళ్ళిపోతుందనే భయం వారిలో మొదలైంది. అలాంటి సమయంలో గిల్ వికెట్ పడింది. దీంతో పాక్ జట్టు హమ్మయ్య అనుకుంది. ఇదే ఆనందంలో శుభ్ మన్ గిల్ అవుట్ అయి వెళిపోతుంటే...అతన్ని క్లీన్ బౌల్డ్ చేసిన బౌలర్ అబ్రార్ వెళ్ళు వెళ్ళు అన్నట్లు సైగ చేశాడు. ఆడింది చాలు అంటూ సెండాఫ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..