/rtv/media/media_files/2025/01/22/Ysnn6ewz0Got6YD66RTN.jpg)
Virat kohli viral video Photograph: (Virat kohli viral video)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఆట తీరుతో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఎంతగానో ప్రేమించే అభిమానులు కూడా విరాట్‌పై మండిపడుతున్నారు. ఓ జవాన్ సెల్ఫీ కోసం తన దగ్గరకు వస్తే నో చెప్పడంతో నెటిజన్లు కోహ్లీను విమర్శిస్తున్నారు. విరాట్ కోహ్లీ ముంబైలో తాజ్ హోటల్ ముందు కారు దిగి నడుచుకుంటూ వెళ్లాడు.
ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర
Virat Kohli denied a selfie to a army man 💔
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 20, 2025
Chose your idol wisely ☹️pic.twitter.com/DMWMv3EhLH
ఇది కూడా చూడండి:OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?
సెల్ఫీ ఇవ్వడానికి నిరాకరించడంతో..
అతన్ని గమనించిన ఆర్మీ జవాన్ సెల్ఫీ కోసం అతని దగ్గరకు వెళ్లాడు. అయితే కోహ్లీ సెల్ఫీ ఇవ్వడానికి నిరాకరించాడు. చేతులతో నో చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు కోహ్లీపై మండిపడుతున్నారు. ఆర్మీ జవాన్‌కి సెల్ఫీ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ ఆ జవాన్‌కి వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి ఇండియన్ ఆర్మీ అంటే గౌరవం లేదని మండిపడుతున్నారు. దేశాన్ని కాపాడే ఆర్మీ జవాన్‌తో ఉండేది ఇలాగేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి:BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
Worst character from Virat Kohli ! pic.twitter.com/m7GbAy5Y5I
— Kolly Censor (@KollyCensor) January 21, 2025
ఇది కూడా చూడండి: భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట!