India vs South Africa : గువాహటి టెస్ట్: లంచ్ కంటే ముందే టీ బ్రేక్.. ఎందుకంటే?

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక శతాబ్దానికి పైగా కొనసాగుతున్న సంప్రదాయం త్వరలో జరగబోయే భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌తో బద్దలు కానుంది. సాధారణంగా టెస్టుల్లో ఆట మొదలైన తర్వాత 'లంచ్', ఆ తర్వాత 'టీ బ్రేక్' తీసుకోవడం ఆనవాయితీ.

New Update
ind vs sa

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక శతాబ్దానికి పైగా కొనసాగుతున్న సంప్రదాయం త్వరలో జరగబోయే భారత్-దక్షిణాఫ్రికా(india-vs-south-africa) టెస్ట్ మ్యాచ్‌తో బద్దలు కానుంది. సాధారణంగా టెస్టుల్లో ఆట మొదలైన తర్వాత 'లంచ్', ఆ తర్వాత 'టీ బ్రేక్' తీసుకోవడం ఆనవాయితీ. అయితే నవంబర్ 22 నుంచి గువాహటిలోని బర్సపరా స్టేడియంలో ప్రారంభమయ్యే రెండో టెస్టులో లంచ్‌కు ముందే టీ బ్రేక్ తీసుకోనున్నారు. సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లు ఉదయం 9:30 గంటలకు మొదలవుతాయి. కానీ గువాహటిలో సాయంత్రం త్వరగా చీకటి పడుతుంది కాబట్టి, రోజుకు కేటాయించిన 90 ఓవర్లు పూర్తి చేయడానికి వీలుగా ఈ కొత్త షెడ్యూల్‌ను రూపొందించారు.

Also Read :  ప్రియుడితో క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి.. తేదీ ఖరారు..!

మొదటి సెషన్ ఉదయం 9:00 – 11:00వరకు జరుగుతుంది. అనంతరం టీ బ్రేక్ ఉంటుంది. ఉదయం 11:00 – 11:20 అంటే 20 నిమిషాలు టీ బ్రేక్ ఉంటుంది. ఆ తరువాత ఉదయం 11:20 – మధ్యాహ్నం 1:20 వరకు రెండో సెషన్ జరుగుతుంది. అనంతరం లంచ్ బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 1:20 – 2:00 అంటే 40 నిమిషాలు పాటు లంచ్ బ్రేక్ కొనసాగుతోంది.  మూడో సెషన్ మధ్యాహ్నం 2:00 – 4:00 వరకు సాగుతోంది. 

Also Read :  IND vs AUS : ఆసీస్‌పై టీమిండియా ప్రతీకార పోరు.. నేడు  తొలి టీ20 మ్యాచ్‌

అందుకే ఆటను త్వరగా ప్రారంభిస్తున్నాం

"గువాహటిలో సూర్యాస్తమయం త్వరగా ఉంటుంది. అందుకే ఆటను త్వరగా ప్రారంభిస్తున్నాం. మైదానంలో ఎక్కువ ఆట సమయాన్ని పొందడానికి టీ బ్రేక్ సెషన్‌ను మార్చాలని నిర్ణయించాం. ఈ మార్పు వల్ల సహజ కాంతిని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సాంప్రదాయకంగా లంచ్ తర్వాత తీసుకునే టీ బ్రేక్‌ను మొదటి సెషన్ తర్వాత ఇవ్వడం ద్వారా, బోర్డు ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని కనుగొంది. రంజీ ట్రోఫీలో కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి మార్పులను అమలు చేశారు.

Advertisment
తాజా కథనాలు