/rtv/media/media_files/2025/06/26/surya-kumar-yadav-2025-06-26-12-00-50.jpg)
Surya Kumar Yadav
Suryakumar Yadav: టీమిండియా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొత్తి కడుపు కుడి దిగువ భాగంలో స్పోర్ట్స్ హెర్నియాకు జపాన్‌లో సూర్యకు సర్జరీ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.. నేను ఆరోగ్యంగా ఉన్నాను.. వీలైనంత త్వరగా స్టేడియంలోకి రావడానికి ప్రయత్నిస్తానని సూర్య కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్.. వెలుగులోకి సంచలన విషయాలు
Suryakumar Yadav shares an update after undergoing successful surgery for a sports hernia.
— OneCricket (@OneCricketApp) June 25, 2025
Wishing you a speedy recovery, Surya Bhau! 💪🇮🇳#SuryaKumarYadav #Cricket #India pic.twitter.com/3bK3UZxEzF
ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్
ఈ సిరీస్ తర్వాత..
సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ సూర్యకు టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించింది. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు పూర్తయింది. ఈ సిరీస్ తర్వాత ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది.
ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్
దీని తర్వాత టీ20 సిరీస్ ఆడుతుంది. అయితే ఈ సిరీస్‌లో సూర్య కుమార్ యాదవ్ ఆడే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ తర్వాత కోలుకోవడానికి దాదాపుగా 6 నుంచి 12 వారాల వరకు సమయం పడుతుంది. పూర్తి ఆరోగ్యంతో సూర్య మళ్లీ ఆడాలంటే కనీసం మూడు నెలలు అయినా సమయం పడుతుంది.
Surya Kumar Yadav After a Successful Surgery Of Sports Harnia #sky #india #SuryakumarYadav pic.twitter.com/b4zSQMbzgU
— Fan Of Cricket 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 (@techsmart484675) June 26, 2025
ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?