IND vs AUS : కోహ్లీ, రోహిత్ పేవల ఫామ్ పై సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు..

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ పేలవ ఫామ్‌పై సునీల్ గవాస్కర్ స్పందించారు. బౌన్సీ పెర్త్ పిచ్‌పై ఆడటం అంత సులభం కాదని అన్నారు. ముఖ్యంగా చాలా నెలల తర్వాత మైదానంలోకి తిరిగి వచ్చినప్పుడు.. ఇలాంటి పిచ్ పై ఆడటం చాలా కష్టమని తెలిపారు. 

New Update
Sunil Gavaskar sensational comments on Kohli and Rohit poor form against australia

Sunil Gavaskar sensational comments on Kohli and Rohit poor form against australia

భారత్ ఆస్ట్రేలియా(IND Vs AUS ODI Series 2025) పర్యటన అంత బాగా ప్రారంభం కాలేదు. సిరీస్ లోని తొలి వన్డే మ్యాచ్ లోనే భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. పెర్త్ లో జరిగిన ఓటమిలో టీమిండియా బ్యాట్స్ మెన్ లు ముఖ్యపాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా అభిమానులు అత్యధిక ఆశలు పెట్టుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరాశ పరిచారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ రీఎంట్రీ మ్యాచ్ లలో ఘోరంగా విఫలమయ్యారు. అదే సమయంలో కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా పెద్దగా రాణించలేకపోయారు. 

అంత సులభం కాదు

దీంతో భారత్ బ్యాటింగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు కూడా తొలి మ్యాచ్ లో సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరడంతో చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. కోహ్లీ, రోహిత్‌లను సమర్థించారు. బౌన్సీ పెర్త్ పిచ్‌పై ఆడటం అంత సులభం కాదని అన్నారు. ముఖ్యంగా చాలా నెలల తర్వాత మైదానంలోకి తిరిగి వచ్చినప్పుడు.. ఇలాంటి పిచ్ పై ఆడటం చాలా కష్టమని తెలిపారు. 

Also Read :  Rohit Sharma: పెర్త్‌లో చరిత్ర సృష్టించిన 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ🏏.. అరుదైన మైలురాయి

ఇండియా టుడేతో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. "వారు ఆస్ట్రేలియాలో అత్యంత బౌన్సీ పిచ్‌పై ఆడుతున్నారు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్లకు ఇది అంత సులభం కాదు. శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు. టీమ్ ఇండియా ఇప్పటికీ మంచి జట్టు. రాబోయే రెండు మ్యాచ్‌లలో రోహిత్, కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడినా ఆశ్చర్యపోకండి. వారు నెట్స్‌లో ఎక్కువ సమయం గడుపుతారో, అంత వేగంగా వారు తమ లయలోకి తిరిగి వస్తారు. వారు పరుగులు చేయడం ప్రారంభించిన తర్వాత.. భారత జట్టు మొత్తం 300 లేదా 300 కంటే ఎక్కువ పరుగులు చేస్తుంది." అని చెప్పుకొచ్చారు. 

Also Read :  AUS vs IND : తొలి వన్డేలో భారత్ చిత్తు..  7 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్

అడిలైడ్‌లో కోహ్లీ అద్భుతమైన రికార్డు

ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో వన్డే అడిలైడ్ మైదానంలో జరుగుతుంది. ఈ మైదానంలో కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో కోహ్లీ 61 సగటుతో 244 పరుగులు చేశాడు. వాటిలో రెండు సెంచరీలు ఉన్నాయి. విరాట్ అడిలైడ్‌లో ఆడటం ఆనందిస్తాడు. టీం ఇండియా రెండవ వన్డేలో తమ స్టార్ బ్యాట్స్‌మన్స్ నుండి పెద్ద ఇన్నింగ్స్‌ను ఆశిస్తుంది. 

Advertisment
తాజా కథనాలు