ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒకే వేదికపై ఆడటం బాగా కలిసొస్తుందంటూ ఇంగ్లాండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ చేసిన వ్యాఖ్యలపై సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. ఇండియా విజయాలను జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారన్నాడు. ఐసీసీ జీతాలు భారత్ ఇస్తుందన్నారు.
Sunil Gavaskar Comments:ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్‌లోనే జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై పలువురు మాజీలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మి్న్స్ వ్యాఖ్యలు ఇటీవలే దుమారం రేపగా.. తాజాగా ఒకే ప్రాంతంలో మ్యాచ్‌లు ఆడటం భారత్‌కు ప్రయోజనకరంగా మారిందని ఇంగ్లాండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్రంగా మడ్డిపడ్డారు.
ఈ మేరకు పక్క జట్లు ఎక్కడ ఆడుతున్నాయో పరిశీలించడం మానేసి తమ జట్టు గెలుపుపై ఫోకస్ చేయాలన్నారు. ‘ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ దాదాపు ఇంటిదారి పట్టింది. ఆ బాధను వేరే జట్లపై నెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇది సరైనది కాదు. తమ టీమ్ లోపాలను వెతికి గెలుపు సూత్రాలను నేర్పించండి. ఈ విషయాలను అర్థం చేసుకొనే తెలివి విమర్శకులకు ఉందని భావిస్తున్నా. ఇంగ్లాండ్ ఎందుకు అర్హత సాధించలేకపోయిందో ఆలోచించండి. ఇండియా టీమ్ పై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మా విజయాలను జీర్ణించుకోలేని మానసిక స్థితిలో ఉన్నారనిపిస్తోంది' అంటూ గావస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు భారత్ అందించే సేవలు అద్భుతమని కొనియాడారు. కేవలం ప్రతిభ పరంగానే కాదు ఆర్థికంగానూ అంతర్జాతీయ క్రికెట్ కు బీసీసీఐ వెన్నుముకగా పనిచేస్తోంది. భారీ ఆదాయం సమకూరుస్తోంది. ఐసీసీ జీతాలను పరోక్షంగా భారత్ అందిస్తుందనే విషయాన్ని గమనించాలని చురకలంటించారు.
Sunil Gavaskar Comments: BCCI లేకపోతే ICCకి జీతాల్లేవ్.. వాళ్లను పొట్టు పొట్టు తిట్టిన సునీల్ గావస్కర్!
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒకే వేదికపై ఆడటం బాగా కలిసొస్తుందంటూ ఇంగ్లాండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ చేసిన వ్యాఖ్యలపై సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. ఇండియా విజయాలను జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారన్నాడు. ఐసీసీ జీతాలు భారత్ ఇస్తుందన్నారు.
Sunil Gavaskar sensational comments on former England cricketers
Sunil Gavaskar Comments: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్‌లోనే జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై పలువురు మాజీలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మి్న్స్ వ్యాఖ్యలు ఇటీవలే దుమారం రేపగా.. తాజాగా ఒకే ప్రాంతంలో మ్యాచ్‌లు ఆడటం భారత్‌కు ప్రయోజనకరంగా మారిందని ఇంగ్లాండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్రంగా మడ్డిపడ్డారు.
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి
విజయాలను జీర్ణించుకోలేని మానసిక స్థితి..
ఈ మేరకు పక్క జట్లు ఎక్కడ ఆడుతున్నాయో పరిశీలించడం మానేసి తమ జట్టు గెలుపుపై ఫోకస్ చేయాలన్నారు. ‘ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ దాదాపు ఇంటిదారి పట్టింది. ఆ బాధను వేరే జట్లపై నెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇది సరైనది కాదు. తమ టీమ్ లోపాలను వెతికి గెలుపు సూత్రాలను నేర్పించండి. ఈ విషయాలను అర్థం చేసుకొనే తెలివి విమర్శకులకు ఉందని భావిస్తున్నా. ఇంగ్లాండ్ ఎందుకు అర్హత సాధించలేకపోయిందో ఆలోచించండి. ఇండియా టీమ్ పై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మా విజయాలను జీర్ణించుకోలేని మానసిక స్థితిలో ఉన్నారనిపిస్తోంది' అంటూ గావస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: USA: జెలెన్ స్కీ పై విరుచుకుపడ్డ అమెరికా ఉపాధ్యక్షుడు
అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు భారత్ అందించే సేవలు అద్భుతమని కొనియాడారు. కేవలం ప్రతిభ పరంగానే కాదు ఆర్థికంగానూ అంతర్జాతీయ క్రికెట్ కు బీసీసీఐ వెన్నుముకగా పనిచేస్తోంది. భారీ ఆదాయం సమకూరుస్తోంది. ఐసీసీ జీతాలను పరోక్షంగా భారత్ అందిస్తుందనే విషయాన్ని గమనించాలని చురకలంటించారు.
Also Read: Dwaraka : కల వచ్చిందని శివలింగం దొంగతనం..వీడిన ద్వారకా మిస్టరీ
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం