/rtv/media/media_files/2025/05/26/IkLCqSS64zUTuvQoRznC.jpg)
Sunil Gavaskar gives key instructions to Shubman Gill
ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత త్వరలో టీమిండియా జట్టు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు తాజాగా వెల్లడైంది. ఈ టెస్ట్ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి కెప్టెన్సీ భాధ్యతల్ని యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు.
ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
గిల్‌కు కీలక సూచన
గిల్ సారథ్యంలో ఇంగ్లాడ్ టూర్‌కు భారత జట్టు ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. అయితే శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ పై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు కొత్త కెప్టెన్ గిల్‌కు కీలక సూచనలు చేశారు. ఈ సమయంలో గిల్ ప్రవర్తన చాలా కీలకం అన్నాడు. సాధారణంగా భారత కెప్టెన్‌గా ఎన్నికైన ఆటగాడిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతుందని.. జట్టు సభ్యుడిగా కొనసాగడానికి, కెప్టెన్‌గా వ్యవహరించడానికి మధ్య చాలా తేడా ఉందని అన్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు సన్నిహితంగా ఉండే తోటి ప్లేయర్లతో సరదాగా ముచ్చటిస్తూనే ఉంటారని.. అదే కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నపుడు మిగిలిన వారిని గౌరవించేలా నీ ప్రవర్తన ఉండాలని సూచించారు. ఆ సమయంలో ఒక సారథికి తన ఆటతీరు కంటే ప్రవర్తనే చాలా ముఖ్యం అని అని సూచించారు. ఇకపోతే భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి జరగనుంది.
భారత్ vs ఇంగ్లాండ్ షెడ్యూల్
1వ టెస్ట్: జూన్ 20-24, 2025- హెడింగ్లీ, లీడ్స్
2వ టెస్ట్: జూలై 2-6, 2025- ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్ట్: జూలై 10-14, 2025- లార్డ్స్, లండన్
4వ టెస్ట్: జూలై 23-27, 2025- ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్ట్: జూలై 31-ఆగస్టు 4, 2025- ది ఓవల్, లండన్
ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
ind-vs-eng-test-match | shabman-gill | sunil-gavaskar | latest-telugu-news | telugu-news