Pakistan: భారత్ పై అక్కసుతో పాక్ బలుపు ప్రదర్శన..శిక్ష తప్పదంటోన్న ఐసీసీ

పాకిస్తాన్ తన పొగరుకు మూల్యం చెల్లించనుంది. యూఏఈతో మ్యాచ్ ను ఆలస్యంగా మొదలెట్టినందుకు, రిపరీ ఆండీ క్రాఫ్ట్ వీడియోను బయటపెట్టినందుకు గానూ ఐసీసీ ఆ జట్టును శిక్షించనుంది. 

New Update
andy

ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా మొన్న యూఏఈ, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభ అయింది. దీనికి కారణం పాక్ జట్టు తమ హోటల్ నుంచి బయటకు రాకపోవడమే. అంతకు ముందు ఇండియాతో జరిగిన మ్యాచ్ లో తమనకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని...దానికి రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పట్టించుకోకపోవడమే కారణమని పాక్ జట్టు అలిగి కూర్చుంది. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. ఆండీ తమకు సారీ చెప్పాలని పట్టుబట్టింది. ఐసీసీ అదేమీ కుదరదు...కావాలంటే ఆడండి..లేదంటే టోర్నీ నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్పేసింది. 

యూఏఈ మ్యాచ్ ముందు బలుపు ప్రదర్శన..

అయినా కూడా పాక్ జట్టు తమ పొగరును తగ్గించుకోలేదు. ఆండీ క్షమాపణ చెబితే కానీ మ్యాచ్ కు రాము అంటూ భీష్మించుకుని కూర్చుంది. చివరకు పీసీబీ..రిఫరీ ఆండీ సారీ చెప్పారని చెబితే అప్పుడు వచ్చి మ్యాచ్ ఆడింది. దీని కారణంగా మ్యాచ్ ఓ గంట ఆలస్యంగా మొదలయ్యింది. 

ఆండీ సారీ వీడియో బయటకు..

దీంతో పాటూ పాకిస్తాన్ జట్టు మరో రూల్ ను కూడా బ్రేక్ చేసింది. రిఫరీ ఆండీ సారీ చెప్పిన వీడియోను బయటపెట్టింది. యూఏఈతో మ్యాచ్ ముందు ఆండీ..పాక్ జట్టులోని కీలక సభ్యునితో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ఐసీసీ రూల్స్ కు వ్యతిరేకం. దీనిపై ఐసీసీనే కాదు..సొంత బోర్డు పీసీబీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే మీడియా మేనేజర్ నయీమ్ గిలానీని మ్యాచ్ రిఫరీ గదిలోకి తీసుకెళ్లవద్దని పాకిస్తాన్ కు చెప్పారని, అయితే వారు ఆ అభ్యర్థనను వినలేదని, అతన్ని అనుమతించకపోతే ఆటను బహిష్కరిస్తామని బెదిరించారని కూడా బయటపడింది.  అంతేకాదు పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పారని సీసీబీ ప్రకటన చేయడాన్ని కూడా ఐసీసీ తప్పుబట్టింది.  

పాకిస్తాన్ చేసిన తప్పులన్నింటినీ ఐసీసీ ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ జట్టుకు పనిష్మెంట్ తప్పదని చెప్పింది. అయితే ఎటువంటి శిక్ష వేస్తారని  మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ పాక్ జట్టు భారీ మూల్యం చెల్లించకతప్పదని తెలుస్తోంది. భారత్ పై అక్కసు తీర్చుకుందామని ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్ చివరకు తన ఓతిలో తానే పడింది. 

Also Read: Trump-Putin: పుతిన్ నన్ను నిరాశపర్చారు..ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు