Raj Nidimorus wife: డైరెక్టర్ రాజ్ నిడిమోరు, సమంత డేటింగ్ లో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా 'శుభం' మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా సామ్ కొన్ని ఫొటోలు షేర్ చేయగా.. అందులో డైరెక్టర్ రాజ్ తో ఉన్న ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో సమంత అతడి భుజాలపై వాలిపోయి చనువుగా.. ఫొటోకు ఫోజులిచ్చింది.
రాజ్ నిడిమోర్ భార్య శ్యామాలి పోస్ట్
అయితే సమంత ఈ పోస్ట్ పెట్టిన కొద్దిగంటల తర్వాత.. రాజ్ నిడిమోర్ భార్య శ్యామాలి దే తన సోషల్ మీడియాలో ఓ సందేశాత్మక పోస్ట్ షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ''నా గురించి ఆలోచించేవారితో పాటు, నన్ను చూసే, నన్ను వినే, నాతో మాట్లాడే, నా గురించి వ్రాసే వారందరికీ నా ఆశీస్సులు, ప్రేమను పంపుతాను'' అంటూ ఓ నోట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/05/15/XCMxxEAuvaA2qdlu3mJL.png)
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయని శ్యామాలి సడెన్ గా ఇలాంటి పోస్ట్ చేయడంతో.. ఎందుకు చేశారా? అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. అది కూడా.. రాజ్- సమంత డేటింగ్ రూమర్లు వైరల్ అవుతున్న వేళ ఈ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
రాజ్- నిడిమోరు శ్యామాలి వివాహం చేసుకొని పదేళ్లు అయ్యింది. శ్యామాలి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అంతేకాదు ఓంప్రకాష్ మెహ్రా , విశాల్ భరద్వాజ్ వంటి చిత్రనిర్మాతలతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉందని సమాచారం. అయితే రాజ్, శ్యామలీ విడిపోతున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి.
telugu-news | cinema-news | telugu-cinema-news | samantha - raj nidimoru | Raj Nidimorus wife Shhyamali De