Smriti Mandhana : తగ్గేదేలే... చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మహిళల వన్డే (Women's ODI) క్రికెట్‌లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టింది.

New Update
mandana

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (smriti-mandhana) మహిళల వన్డే (women’s ODIs) క్రికెట్‌లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టింది.  ICC మహిళల ODI ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌లో  భాగంగా విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్ లో  12 ప‌రుగుల వ్యక్తిగ‌త స్కోరు వ‌ద్ద మంధాన ఈ రికార్డు సృష్టించింది. దీంతో ఆమె ఆస్ట్రేలియా దిగ్గ‌జ ప్లేయ‌ర్ బెలిండా క్లార్క్‌ను అధిగ‌మించింది. 

క్లార్క్ 1997లో 16 మ్యాచ్‌లు ఆడి మొత్తం 970 పరుగులు సాధించగా, మంధాన ఇప్పుడు 17 మ్యాచ్‌ల్లో 972 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మంధాన కనీసం 41 పరుగులు చేస్తే, ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1000 వన్డే పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించనుంది. ఈ మ్యాచ్‌లో కనీసం 81 పరుగులు చేస్తే, ఆమె వన్డేల్లో 5000 పరుగులు కూడా పూర్తి చేస్తుంది. 

Also Read :  తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం!

ప్రస్తుతానికి మహిళ వన్డే క్రికెట్ లలో నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే 5000 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగారు. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరు మీద ఉంది. 1999 నుంచి 2022 వరకు 232 మ్యాచ్‌లు ఆడి మొత్తం 7805 పరుగులు చేసిందిమిథాలీ.. ఇంగ్లాండ్‌కు చెందిన షార్లెట్ ఎడ్వర్డ్స్ (191 వన్డేల్లో 5992 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (173 వన్డేల్లో 5896 పరుగులు),  వెస్టిండీస్‌కు చెందిన స్టెఫానీ టేలర్ (170 వన్డేల్లో 5873 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

ఇక ఈ సంవత్సరం స్మృతి అద్భుతమైన ఫామ్‌లో ఉంది. సెప్టెంబర్ 2025లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో, ఆమె రెండు సెంచరీలు చేసింది. సెప్టెంబర్ 20న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో, మంధాన కేవలం 50 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసింది. 

మ‌హిళ‌ల క్రికెట్‌లో ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ప్లేయ‌ర్లు వీరే..

* స్మృతి మంధాన (భార‌త్‌) – 972* (2025లో)
* బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) – 970 ప‌రుగులు (1997లో)
* లారా వోల్వార్డ్ట్ (ద‌క్షిణాఫ్రికా) – 882 ప‌రుగులు (2022లో)
* డెబ్బీ హాక్లీ (న్యూజిలాండ్‌) – 880 ప‌రుగులు (1997లో)
* అమీ సాటర్త్‌వైట్ (న్యూజిలాండ్‌) – 853 ప‌రుగులు (2016లో)

Advertisment
తాజా కథనాలు